ఖమ్మం నగరంలోని 49 వ డివిజన్ మామిల్లగూడెం లో రోడ్లు, డ్రైనేజ్ లకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… కమీషనర్ అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినప్పటికీ పాత పద్ధతిలో కాకుండా భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని నాణ్యత ప్రమాణాల ప్రకారం నిర్మాణాలు చేపట్టండి అని కోరారు. నిర్మాణం చేసేప్పుడు కార్పొరేటర్లు, డివిజన్ పెద్దలు వాటి నిర్మాణంలో నాణ్యత లేకపోతే కమీషనర్ కు సమాచారం ఇవ్వండని సూచించారు. Also Read:Buggamatham…
ఏపీ సరిహద్దులో ఉండే తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావు పేట. పేరుకు గిరిజన నియోజకవర్గం అయినా... అజమాయిషీ మాత్రం వేరే వర్గాలదే. ఇన్నాళ్ళు ఎమ్మెల్యేలు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా బండి లాగించేశారు.
Tummala Nageswara Rao : ఖమ్మం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సన్నర కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి పలు కీలక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రాహుల్ గాంధీ దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభించారని, 4,400 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం…
Coal Mines: ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో కురిసిన భారీ వర్షం బొగ్గు గనుల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించింది. ఈ వర్షం ప్రభావంతో జే.వి.ఆర్. ఓసి (JVROC), కిష్టారం ఓసి (Kishtaram OC)లల్లో బొగ్గు ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయింది. వరద నీరు గనుల్లోకి చేరడంతో మట్టి వెలికితీతతో పాటు బొగ్గు తవ్వకాల్లో సమస్యలు ఏర్పడ్డాయి. జేవిఆర్ ఓసి గనిలో రోజుకు సగటున 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. అలాగే సుమారు 50,000 క్యూబిక్ మీటర్ల…
జనగామ జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులతో భారీ వడగండ్ల వాన కురిసింది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. కొంత ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. జనగామ ,లింగాల గణపురం, రఘునాథపల్లి మండలాల్లో కురిసిన వర్షానికి పంట నేలరాలింది. పలుచోట్ల రహదారులపై చెట్లు నేలకొరిగాయి.
పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, వనజీవి రామయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. చెట్లను పెంచండి అంటూ చిన్న తనం నుంచే ప్రచారం చేస్తూ చెట్లు నాటుతూ సేవ చేసిన దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య. వనజీవి రామయ్య మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. ప్రకృతి ప్రేమికులు, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Also Read:Vijayashanti: నటి…
Rythu Bandhu : మరో రెండు రోజుల్లో రైతు భరోసా నిధులు 90 శాతం మంది రైతుల ఖాతాల్లో జమ అవుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. ఈరోజు మంత్రి ఖమ్మంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల వ్యవసాయ భూములు పరిశీలించడం జరుగుతుందని, అవి మినహా మిగతా వ్యవసాయ భూములకు రైతుబంధు నిధులు మరో రెండు రోజుల్లో జామవుతాయని చెప్పారు. ఉగాది రోజున ఖమ్మం జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ…
TGSRTC: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలను కోరుకున్న భక్తుల ఇళ్లకు చేర్చాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఎప్పటిలాగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను హోం డెలివరీ చేసే పవిత్ర కార్యానికి సంస్థ శ్రీకారం చుట్టింది.
బీఆర్ఎస్ నేత డోకుపర్తి సుబ్బారావుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. అనారోగ్యంగో బాధపడుతున్న సుబ్బారావును ఎర్రవల్లిలోని తన నివాసానికి కేసీఆర్ ఆహ్వానించారు. దీంతో సుబ్బారావు దంపతులు.. కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా సుబ్బారావు యోగ క్షేమాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.