అధికారంలో ఉన్న దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం నడుస్తుంది.. యుద్ధంలో ప్రజలు గెలవాలని రాహుల్ గాంధీ కోరుకున్నారు.. కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు గెలిచినట్లు అని భట్టి విక్రమార్క ప్రకటించారు.
ఓడిపోయి ఇంటి దగ్గర ఉన్నోడిని తీసుకు వచ్చి మంత్రి పదవి ఇస్తే ఖమ్మం జిల్లాలో అయన పార్టీ కోసం చేసింది సున్నా అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నేడు పాలేరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఖమ్మం నేతలపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులపై ఆయన మండిపడ్డారు.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్లోకి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తల వలసలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఖమ్మం కమ్మ మహాజన సంఘం జిల్లా కార్యదర్శి తాళ్లూరి జీవన్ కుమార్ శనివారం రవాణా breaking news, latest news, telugu news, khammam, big news, brs
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఆయన మండిపడ్డారు. మాకు కుల, మతల ఫీలింగ్స్ లేవు అని పేర్కొన్నారు. ఈ బాబ్రీ మసీదు కూల్చింది కాంగ్రెస్ పార్టీ హయాంలో కాదా.. ధర్మపురి అర్వింద్ తో చేతులు కలిపి ఎమ్మెల్సీ కవితమ్మను ఓడించలేదా అని ఆయన ప్రశ్నించారు.
ఖమ్మం జిల్లా బీసీ నాయకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు ఆహ్వానించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఉద్దేశించి సీరియస్ గా హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలో ఎన్నికల సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ పార్టీకి రిజైన్ చేశారు. ఈ మేరకు తన రాజీనామా లెటర్ ను నేడు సీఎం కేసీఆర్ కు పంపించారు.
ఖమ్మం వెళ్తూన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నల్గొండ జిల్లా నకిరేకల్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుని డబ్బు సంచుల్ని దాచుకుంటుంది అని ఆయన ఆరోపించారు.
చిన్న తనంలోనే ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు.. ప్రజాహితం కోసం అభివృద్ధి కోసమే రాజకీయాలు చేస్తా నా స్వార్ధం కోసం చేయను.. మంత్రిగా ఉండి పాలేరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తీర్చే అవకాశం శ్రీరామచంద్రుడు నాకు కల్పించారు అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులు.. గ్రూపులు లేకుంటే అది కాంగ్రెస్ పార్టే కాదు అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక్కరిదే పెత్తనం ఉంటుంది.. అది కేవలం రాహుల్ గాంధీనే అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.