ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో మండల బూత్ కమిటీ సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాలేరు నియోజకవర్గంలో కందాల గెలుపు ఎవరు ఆపలేరు.. గేటు తాకనీయను అంటమంటే పాలేరు ప్రజలని అవమానించినటే.. ఖమ్మం జిల్లా ప్రజల్ని అవమానించినట్టే.. బీఆర్ఎస్ పార్టీని రెండు సార్లు గెలిపించారు మళ్లీ మూడో సారి కూడా గెలిపిస్తారు అనే నమ్మకం నాకుంది అని ఆయన తెలిపారు. పాలేరు ఎమ్మెల్యే కందల మీద ఎటువంటి మచ్చ లేదు.. కష్టాల్లో ఉన్న తెలంగాణ ప్రజల్ని ఎన్నో రకాలుగా ఆదుకోవాలని కృషి చేసినటువంటి వ్యక్తి మన కేసీఆర్ అని నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Read Also: AP CM Jagan: జగనన్న ఆరోగ్య సురక్ష, ‘వై ఏపీ నీడ్స్ జగన్’ క్యాంపెయిన్లపై కలెక్టర్లతో సీఎం సమీక్ష
రైతు బాగుంటే రాజ్యం బాగుంటది అని రైతుల గురించి ఆలోచించిన వ్యక్తి కేసీఆర్ అని ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు. 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత భారతదేశంలో ఒక కేసీఆర్ ది.. రైతు పండించిన పంట అంత కేసీఆర్ ప్రభుత్వమే కొనుగోలు చేసింది అని ఆయన చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఆడబిడ్డ పుట్టింది అంటే ఇంటిల్లిపాది కన్నీళ్లు పెట్టుకునేవారు.. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది అంటే మా ఇంట్లో లక్ష్మీదేవి అని చెప్పుకునే స్థాయికి కేసీఆర్ తీసుకొచ్చారు.. ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా ఇవ్వటం అంటే అది పెద్ద గొప్ప విషయం భారతదేశంలో ఎక్కడా ఏ రాష్ట్రము ఇవ్వలేదు.. మాయమాటలు మోసం మాటలు చెప్పడానికి వచ్చారు వారికి తగిన బుద్ధి చెప్పాలి.. నాకు ఎంపీగా నిలుచున్నప్పుడు అత్యధిక మెజార్టీ ఇచ్చిన మండలం పాలేరు నియోజకవర్గం లోని నేలకొండపల్లి మండలం అని నామ నాగేశ్వరరావు వెల్లడించారు.