Ponguleti: ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత.. ఐటీ దాడులను నిరసిస్తూ కార్యకర్తలు, అనుచరుల ఆందోళన.. పొంగులేటి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు కార్యకర్తల ప్రయత్నం.. దాదాపు 7 గంటలుగా తనిఖీలు సాగుతున్నాయి. ఖమ్మం, హైదరాబాద్‌లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఖమ్మంలో 5, హైదరాబాద్‌లో 10 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పొంగులేటి బంధువులు, కీలక ఉద్యోగుల ఇళ్లల్లోనూ సోదాలు చేస్తున్నారు. ఇవాళ పాలేరులో పొంగులేటి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
పాలేరు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయంలో గురువారం ఉదయం ఐటీ సోదాలు జరిగాయి. ఖమ్మంలోని పొంగులేటి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు 8 వాహనాల్లో వచ్చారు. ఇది జరుగుతుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెండు రోజుల క్రితమే చెప్పారు. ఖమ్మంలోని పొంగులేటి ఇంటి కార్యాలయాలను తనిఖీ చేస్తున్న ఐటీ శాఖ అధికారులు. పొంగులేటి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో పొంగులేటి కుటుంబ సభ్యులంతా ఖమ్మంలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే పొంగులేటి అనుచరులు, శ్రేణులు ఇంటివద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలో పోలీసులు అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఎంటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున 4:30 గంటలకు వచ్చిన ఐటీ అధికారులు వారందరి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి అనుచరుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పాలేరు, హైదరాబాద్‌లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. వంశీరామ్ బిల్డింగ్స్‌లోని ఆయన నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. పొంగులేటి రాఘవ్ కన్‌స్ట్రక్షన్ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో చేరాడు. అయితే తనకు ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో పొంగులేటి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఆ తర్వాత ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచి పాలేరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు జరుగుతుండటం గమనార్హం.