Khammam Student: అమెరికాలో దారుణం.. ఖమ్మం విద్యార్థిపై కత్తితో దాడి! అపస్మారక స్థితిలో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam MS Student Attacked by thug in US: అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఖమ్మం విద్యార్థిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఆసుపత్రి తరలించగా.. వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఈ సంఘటన మంగళవారం వెలుగు చూసింది. విషయం తెలిసిన విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే…
ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా వరుణ్ రాజ్ (29) అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతున్నాడు. వరుణ్ ఎంఎస్ చేస్తూనే పార్ట్‌టైం జాబ్ కూడా చేస్తున్నాడు. మంగళవారం వరుణ్ జిమ్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ఒక దుండగుడు కత్తితో అతడిపై దాడి చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకొని వరుణ్‌ను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వరుణ్‌కు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు.
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
Also Read: IND vs SA: కోల్‌కతాలో బ్లాక్ టికెట్ దందా.. రూ. 2500 టికెట్ ఏకంగా 11 వేలు!
వరుణ్ రాజ్‌పై దాడి చేసిన వ్యక్తిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వరుణ్ రాజ్ తండ్రి రామ్మూర్తి మంగళవారం రాత్రి మంత్రి పువ్వాడ అజయ్‌ను కలిశారు. తన కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా సాయం చేయాలని ఆయన మంత్రిని కోరారు. గత ఫ్రిబ్రవరిలో ఓ ఖమ్మం విద్యార్థి మరణించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!