తెలంగాణకు తనకు ఉన్న బంధాన్ని సోనియమ్మ వెల్లడించారు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మీరందరూ తనతో ఉంటారుగా అని హామీ తీసుకొని వెళ్లారు సోనియమ్మ.. ఆ హామీని మనం నెరవేర్చాలి.. అభ్యర్థులు ఎవరైనా మన గుర్తు హస్తం గుర్తు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. 6 డిక్లరేషన్లను ఖచ్చితంగా అమలు చ్చేస్తాం..
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం, కొత్తగూడం వాళ్లతో ఇదే ప్రాబ్లం.. బీజేపీ చేసింది ఏమీ లేదు.. అటెన్షన్ డ్రైవర్షన్ చేసి ఓట్లతో గట్టెక్కాలని చూస్తుంది.. సమాజాన్ని కులం, మతం పరంగా విభజించాలని చూస్తుంది.. మతం పేరుతో మంట పెట్టి ఆ మంటలలో చలికాపుకోవాలని బీజేపీ చూస్తుందన్నాడు.
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ చీప్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. తుమ్మలకు పార్టీ కండువా కప్పి ఖర్గే కాంగ్రెస్ పార్టీలోకి సాదర స్వాగతం పలికారు.
కాంగ్రెస్‌లో షర్మిల ఏ స్థానానైనా అడగొచ్చు.. అడిగేందుకు ట్యాక్స్ లేదు కదా అంటూ సెటైర్లు వేశారు. షర్మిల ఏమైనా పాలేరులో పుట్టిందా, పాలేరులో పోటీ చేస్తా అని చెప్పడానికి షర్మిల ఎవరు అని మండిపడ్డారు. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో మా అధిష్టానం చెప్పాలన్నారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామంలో అన్న కర్రీ రాంబాబుని తమ్ముడు దారుణంగా హత్య చేసిన ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. అయితే.. కర్రి రాంబాబు సైకోగా మారి గ్రామస్తులపై పలు దఫాలుగా దాడి చేస్తుండతో రాంబాబుని కాళ్లు చేతులు కట్టేసి కర్రతో తమ్ముడు తీవ్రంగా కొట్టాడు
తెలంగాణలో కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయని.. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం బహిరంగ సభలో స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గోస-బీజేపీ భరోసా భారీ బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్.. సోనియా కుటుంబం కోసం, బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తుందని ఆరోపించారు.
అమిత్షా తెలంగాణలో పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రేపు భద్రాచలం కార్యక్రమం క్యాన్సిల్ అయింది. దీంతో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఆదివారం మధ్యాహ్నం గన్నవరం చేరుకుంటాడు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు షా రానున్నారు.
రేపు తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ నిర్వహించే సభలో ఆయన పాల్గొననున్నారు. రైతు ఘోష బీజేపీ భరోసా బహిరంగ సభలో షా పాల్గొంటారు.