Khammam Politics: ఉమ్మడి ఖమ్మం జిల్లా టిఆర్ఎస్‌లో రాజకీయాలు ఎక్కువే. అక్కడ పార్టీలో నేతలు ఎక్కువే. వలస నేతలకు.. పార్టీలో ముందు నుంచి ఉంటున్న వారికి పొసగని పరిస్థితి. ఇటీవల కాలంలో ఈ పోరు రోడ్డున పడి రచ్చ రచ్చ అవుతుండటంతో.. సమస్య పరిష్కారానికి అధికారపార్టీ చర్యలు మొదలు పెట్టింది. అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో టీఆర్ఎస్ ఒక సీటే గెలిచింది. 2018 ఎన్నికల్లోనూ అదే సీన్. ఇక్కడ కాంగ్రెస్…
ఒక్క విగ్రహావిష్కరణ అధికారపక్షం నేతల మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్బంగా జరిగిన ఘర్షణ ఖమ్మం జిల్లాలో చినికి చినికి గాలి వానగా మారుతోంది. టీఆర్ఎస్ పార్టీలోని రెండు వర్గాలు బాహా బాహికి గత రాత్రి దిగగా.. ఆ దాడుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో ద్రోహం చేసిన వ్యక్తి రేగా అంటూ మాజీ ఎంఎల్ఎ పాయం ఆరోపిస్తుండగా పొంగులేటి పార్టీ బయటకు వెళ్లి పర్యటనలు చేయాలని రేగా కాంతారావు అంటున్నాడు.…
తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.. అధికార పార్టీ అభ్యర్థికి పడాల్సిన ఓట్లు.. ప్రతిపక్ష అభ్యర్థికి పడ్డాయి.. పెద్ద సంఖ్యలో క్రాస్ ఓటింగ్ జరగడం చర్చగా మారింది. అయితే, ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఇప్పటికే ప్రకటించిన.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు… తాజాగా చేసిన కామెంట్లు హీట్ పెంచాయి.. ఉమ్మడి ఖమ్మంజిల్లా అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ తుమ్మల అని వ్యాఖ్యానించిన ఆయన.. నా గెలుపు ఉగాది పచ్చడిలా…