Tummala Nageswara Rao : ఖమ్మం జిల్లా ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉన్న భారం ఎవరీ మీద లేదన్నారు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వండని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండి కూడ ఒక్క ఎకరానికి నీళ్లు లేవన్నారు. ఖమ్మం జిల్లాలో 10 నియోజక వర్గాలకు గోదావరి జలాలు అందించాలనేది నా కోరిక అని, కరువు వచ్చినా కాటకాలు వచ్చినా ఖమ్మం 10 నియోజక వర్గాలు చల్లగా ఉంటాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ఖమ్మం జిల్లాలో రైల్వే లైన్ పూర్తి కావాలని జాతీయ రహదారులు పూర్తి అవ్వాలని కోరా అని. మీరు మమ్మల్ని కడుపులో పెట్టుకుని గేలిపించుకున్నారు మీరు అబ్బా అనుకునేలా పని చేస్తా, ఛీఛీ అనేలా పని చేయనన్నారు. 30 కోట్లు ఇస్తే సత్తుపల్లి, అశ్వరావ్ పేట నియోజకవర్గాలకు నీళ్లు తీసుకుని వస్తా అని, రైతులు అంతా కూడ పామెయిల్ వేయండి నేను గన్ ఇక్కడే పెట్టానన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. అంతేకాకుండా.. ఏప్రిల్ మే వరకు నీళ్లు తీసుకుని వస్తా పామెయిల్ వేయండని, 40 మండలాలకు నీళ్లు ఇచ్చే అవకాశం నాకు వచ్చిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.
అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.. మార్పు కావలి ఇందిరమ్మ రాజ్యం కావాలి అని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద వాడికి మంచి చేయాలనే లక్ష్యం తో పని చేస్తాం. గత ప్రభుత్వం ఈ పని ఎప్పుడో చేయొచ్చు కానీ చేయలేదు. కాంగ్రెస్ అంటే రఘునాథపాలెం మండలం రఘునాథపాలెం అంటే కాంగ్రెస్ అన్నట్లు ఎన్నికల్లో పని చేశారు.’ అని వ్యాఖ్యానించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.. ఇక్కడ జరిగే కార్యక్రమం మంచి కార్యక్రమం.. ఈ ప్రాజెక్ట్ విలువ కేవలం 54 కోట్లే అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి,.. ఇందిరమ్మ రాజ్యం వచ్చి సంవత్సర కాలం కూడ కాకముందే గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయని అభివృద్ధి మనం చేశాం.. మనం చేసే పనులన్నీ ఇంటింటికి బాధ్యత మనపై ఉంది.. ఖమ్మం జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా’ అని ఆయన అన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ..’మంచుకొండ ఎత్తిపోతల పధకం తో ఈ ఏడు సంక్రాంతి పండుగ గట్టిగ చేయొచ్చు. మీ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కీలక పదవులు మీ వద్దనే ఉన్నాయ్. ఈ 5 ఎల్లే కాదు మరో 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి.’ అని ఆయన అన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తుమ్మల నాగేశ్వరావు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. సంక్రాంతి కీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇవ్వాలని ఇబ్బంది పెట్టాడు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 54 కోట్లతో మంచి జరుగుతుంది. ఈ రోజు శంఖుస్థాపన ఉగాదికి నీళ్లు అందిస్తాడట. తక్కువ ఖర్చుతో ఎక్కువ మంచి జరిగేలా.. ఈ రోజు ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులే రాష్ట్ర రాజకీయాలు నడిపిస్తున్నాయి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరావు లు ఉన్నారు.. నేను ఇరిగేషన్ మంత్రి అయినా రోజు లక్ష 18 వేల కోట్ల రూపాయలతో ఒక్క ఆయా కట్టు తీసుకుని రాలేదు..
రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీళ్లు తీసుకుని వచ్చేందుకు మేము కృషి చేస్తున్నాం.. 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట తెలంగాణ రాష్ట్రంలో పండించాం.. పండించిన ప్రతి గింజను సివిల్ సప్లై ద్వారా కొనుగోలు చేశాం.. ఖమ్మం జిల్లాకు పెద్ద ఎత్తున గోదావరి నది జలాలు తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తున్నాం.. 10 ఏళ్ళ పాటు ఇవ్వని రేషన్ కార్డులు ఇస్తాం.. సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో గొప్ప పధకాలు తీసుకుని వచ్చాం.. మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయణం, గ్యాస్ సిలిండర్ 500 కే అందిస్తున్నాం.. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా ఎన్నికల్లో 10 కి 9 స్థానాలు గెలిపించారు.’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Bima Sakhi Yojana: 10th పాసైన మహిళల కోసం కొత్త స్కీమ్.. ఇంట్లోనే ఉంటూ వేలల్లో సంపాదన!