వినాయక చవితి అంటే మనకు హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. హైదరాబాద్‌లో వేలాది మండపాల్లో వినాయకులు కొలువుదీరుతారు. అన్నింటికంటే స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపించే వినాయకుడు మాత్రం ఖైరతాబాద్ వినాయకుడే అని చెప్పాలి. ఎందుకంటే, ప్రతి ఏడాది అడుగుచొప్పున పెంచుకుంటూ ఒక్కో ఏడాది ఒక్కో అవతారంలో గణపయ్య దర్శనం ఇస్తుంటారు. గతేడాది కరోనా కాలంలో కూడా మహాగణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 10 వ తేదీన వినాయక చవితి కావడంతో ఆ రోజు నుంచి 9 రోజుల పాటు నవరాత్రులు నిర్వహస్తారు. ఇక ఈసారి ఖైరతాబాద్‌లో పంచముఖ రుద్రమహా గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. విగ్రహం సిద్ధం కావడంతో ఆయన్ను దర్శించేందుకు పెద్ద ఎత్తున నగర ప్రజలు ఖైరతాబాద్‌కు వస్తున్నారు. ఏడాది 40 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పు 28 టన్నుల బరువుతో ఖైరతాబాద్ వినాయకుడిని ఏర్పాటు చేశారు.
Read: తాలిబన్లతో పాక్ ఐఎస్ఐ చీఫ్ చర్చలు… వాస్తవమే… కానీ…