Konda Rajiv Gandhi: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీశ్ గాంధీ.. చంద్రబాబుది టార్చ్ లైట్ పాలనైతే.. జగన్ ది టార్చ్ బేరర్ పాలన అని పేర్కొన్నారు.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వీధిలైటు వెలగకపోతే తనకు తెలుస్తుందన్న చంద్రబాబుకు కేజీహెచ్ లో 12 గంటలు కరెంటు లేదన్న విషయం ఎందుకు తెలియ లేదు..? అని ప్రశ్నించారు.. పేదల ఆరోగ్యం మీద ప్రభుత్వానికి బాధ్యత…
ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో అంధకారం అలముకుంది. దాదాపు 10 గంటల పాటు పేషెంట్లు తీవ్ర అవస్థలు పడ్డారు. బాలింతలు గర్భిణీలు చంటి పిల్లలతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. మొబైల్ వెలుతురులో వైద్యం అందిస్తూ, కొవ్వొత్తుల వెలుగులో విధులు నిర్వహిస్తూ నర్సింగ్ సిబ్బంది కూడా పడరాని పాట్లు పడ్డారు. ఉత్తరాంధ్ర పెద్దాసుపత్రికి గ్రహణం పట్టింది. మధ్యాహ్నం నుంచి విద్యుత్ నిలిచిపోవడంతో రోగులతో కిటకిటలాడే వార్డులన్నీ అంధకారంలో మగ్గిపోయాయి. చిమ్మ చీకటిలో రోగులు అల్లాడిపోయారు. రాజేంద్రప్రసాద్…
Rithu Sahu Case: బెంగాల్ విద్యార్థిని రీతు సాహు మృతి కేసు విశాఖ పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.. కేవలం పోలీసులకే కాదు, విచారణ కమిటీ అధికారులు, కాలేజీ యాజమాన్యం, హాస్టల్ నిర్వాహకులు పాత్రపై నిగ్గు తేల్చాలి.. మొదట పోలీసులు, తర్వాత హైకోర్టు, ఇప్పుడు సీబీఐకి విద్యార్థిని కేసు అప్పగించాలంటూ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. అది 2023 జూలై 14న హాస్టల్ భవనం పైనుంచి పడి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా…
అనారోగ్య ప్రదేశ్ ను ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ దిశగా తీసుకు వెళ్తున్నాం అన్నారు.. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ని మరింత విస్తృతం చేస్తున్నాం అన్నారు.. క్యాన్సర్ మహమ్మారిగా తయారైంది.. ఐసీఎంఆర్ లెక్కలు ప్రకారం దేశంలో 8.74 లక్షలు మంది, మన రాష్ట్రంలో 42 వేల మంది క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు సత్యకుమార్..
విశాఖపట్నంలోని కేజీహెచ్ లో ఆధునికీకరించిన కార్డియాలజీ విభాగాన్ని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజినీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజినీ మాట్లాడుతూ.. ఆంధ్ర మెడికల్ కాలేజ్ 100 యేళ్లు పూర్తి చేసుకుంది..
Baby Dead Body on Scooty: పండంటి కూతుర్ని కాపాడుకోవాలన్న ఆ దంపతులు ఆశ తీరలేదు. కంటిపాప కన్నుమూసిందని దుఃఖంలో ఉంటే , ఆసుపత్రి సిబ్బంది దుర్మార్గంగా ప్రవర్తించారు. పసిగుడ్డు మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ అడిగితే మానవత్వం లేకుండా తిరస్కరించారు. మరోదారి లేక ద్విచక్ర వాహనంపై బిడ్డ శవాన్ని మధ్యలో కూర్చో బెట్టుకుని, ఒకట్రెండు కాదు ఏకంగా 120 కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ అమానవీయ ఘటన ఉమ్మడి విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకుందామని…
విశాఖ జిల్లాలో పసిపాప కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. టెక్నాలజీ సాయంతో పాపను కిడ్నాప్ చేసిన ముఠా గుట్టురట్టుచేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ జంక్షన్ వద్ద పోలీసుల తనిఖీల్లో చిన్నారిని రక్షించారు. విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. నిన్న 8 గంటలకు కెజిహెచ్ పాప కిడ్నాప్ అయ్యిందని సమాచారం వచ్చింది. నిన్న అన్ని చోట్ల పోలీసుల గాలించారు. మన ఇల్లు మన బాధ్యత ప్రోగ్రామ్ ద్వారా షాపుల్లో అపార్ట్‌మెంట్ లో…
అరుదైన శస్త్రచికిత్సకు వేదికైంది విశాఖ కేజీహెచ్. తొలిసారిగా వెంటిలేటర్ పై ఉన్న గర్భిణీకి సిజేరియన్ చేసారు కేజీహెచ్ వైద్యులు. కరోనాతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న గర్భిణీకి విజయవంతంగా ఆపరేషన్ చేసారు. కేజీహెచ్‌లో సీఎస్ఆర్ బ్లాక్‌లో ఉన్న 30 ఏళ్ల గర్భిణీకి గెనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కవిత ఆధ్వర్యంలోని బృందం ఈ ఉదయం శస్త్రచికిత్స చేసింది. ఆపరేషన్ చేసి మగబిడ్డను సురక్షితంగా బయటకు తీసారు. శిశువుకి కరోనా టెస్ట్ నిర్వహించగా నెగటివ్ వచ్చినట్లు తెలిపారు. సిజేరియన్ తర్వాత ఆరోగ్యంతో…