Konda Rajiv Gandhi: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీశ్ గాంధీ.. చంద్రబాబుది టార్చ్ లైట్ పాలనైతే.. జగన్ ది టార్చ్ బేరర్ పాలన అని పేర్కొన్నారు.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వీధిలైటు వెలగకపోతే తనకు తెలుస్తుందన్న చంద్రబాబుకు కేజీహెచ్ లో 12 గంటలు కరెంటు లేదన్న విషయం ఎందుకు తెలియ లేదు..? అని ప్రశ్నించారు.. పేదల ఆరోగ్యం మీద ప్రభుత్వానికి బాధ్యత లేదు అని మండిపడ్డారు.. ఐదు జనరేటర్లు పెడితే కేజీహెచ్ కు కరెంటు వచ్చేది.. లక్ష రూపాయల ఖర్చు చేస్తే రోగులు ఇబ్బంది పడేవారు కాదు.. జనరేటర్ కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది అని విమర్శించారు.. కూటమి పాలనలో హాస్పిటల్‌లో రోగులకు.. దేవాలయాల్లో భక్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు.. పలాస వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు చనిపోతే ప్రభుత్వ పరిధిలో దేవాలయం కాదన్నారు.. మరి కేజీహెచ్ ప్రభుత్వ ఆస్పత్రి కాదా? అని నిలదీశారు.. దేవి అనే మహిళ చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు..? అని ఫైర్ అయ్యారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీశ్ గాంధీ.
Read Also: The Family Man Season 3 : ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ట్రైలర్ రిలీజ్..