సరిహద్దులో భారత్-పాకిస్తాన్ యుద్ధం ఆగినా.... బెజవాడలో బ్రదర్స్ వార్ మాత్రం ఆగే సూచనలు కనిపించడం లేదు. పైగా పీక్స్‌కు చేరుతోంది. తనను చంపేస్తానని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని నేరుగా మాజీ ఎంపీ కేశినేని నాని పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేయడంతో... మేటర్ మాంఛి రసకందాయంలో పడింది.
బాహుబలి రెండే పార్టులు.. కానీ, కేశినేని నాని చీటింగ్ 1 నుంచి 10 వరకు.. అంటే పది పార్టుల వరకు ఉంటుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని.. మాజీ ఎంపీ కేశినేని నాని మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోన్న వేళ.. కేశినేని నానిపై విరుచుకుపడ్డారు వెంకన్న.. పదేళ్లు పార్లమెంటు మెంబర్‌గా ఉండి ఆ పార్టీని, అధ్యక్షుడుని లెక్క చేయకుండా మట్లాడిని వ్యక్తి నాని అని ఫైర్…
బెజవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య మరోసారి రాజుకున్న వివాదం పొలిటికల్ ప్రకంపనలు రేపుతోంది? రెండు సార్లు ఎంపీగా గెలిచిన అన్న నానిని గత ఎన్నికల్లో మొదటి ప్రయత్నంలోనే ఓడించి రికార్డు మెజార్టీతో పాగా వేశారు తమ్ముడు కేశినేని చిన్ని. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఈ అన్నదమ్ముల మధ్య వివాదం 2024 ఎన్నికలకు ముందు బయట పడింది. నాని ఎంపీగా ఉన్నప్పుడే... టీడీపీలో యాక్టివ్ అయిపోయి ఆయనకు పక్కలో బల్లెంగా మారారట చిన్ని. చివరికి…
Kesineni Chinni vs Kesineni Nani: విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య వార్ ముదురుతుంది. మాజీ ఎంపీ కేశినేని నానికి టీడీపీ ఎంపీ చిన్ని లీగల్ నోటీసు పంపించారు. రూ. 100 కోట్లు నష్ట పరిహారం కోరుతూ ఈ లీగల్ నోటీసులు జారీ చేశారు. కాగా, కేశినేని చిన్ని పంపిన లీగల్ నోటీసులపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మాజీ ఎంపీ కేశినేని నాని ఓ పోస్ట్ పెట్టారు.
విశాఖ స్టేడియం పేరు మార్పు వివాదంపై వైసీపీకి టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. క్రీడలను రాజకీయాలను ముడి పెట్టొద్దన్నారు. స్టేడియానికి 30 ఏళ్లుగా ఉన్న పేరే ఉంది.. మేం ఏ పేరు మార్చలేదని స్పష్టం చేశారు. రాజకీయం చేయటం కోసమే వైసీపీ ఇదంతా చేస్తోందని విమర్శించారు. ఎందుకు వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారో వారికే తెలియాలన్నారు. విశాఖ ప్రతిష్ఠ పెంచేలా కూటమి ప్రభుత్వం కష్టపడి మ్యాచ్ లు…
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గత ప్రభుత్వ హయాంలో పొలిటికల్ ఉద్యోగాలు అందించేలా సలహాదారు నియామకాలు జరిగేవి. కానీ, కూటమి ప్రభుత్వం పలు రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికీ మాత్రమే సలహాదారుగా నియమించారు. ఏపీకి 7 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేలా కూటమి కృషి చేస్తోంది. త్వరలో విశాఖ, విజయవాడలో మెట్రో రాబోతోంది. 11 పట్టణాలకు 750 ఎలక్ట్రిక్ బస్సులు కేంద్రం సహకారంతో తెస్తున్నామని వెల్లడించారు.…
Kesineni Chinni: కృష్ణాజిల్లా జిల్లాలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ప్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఏఏసీ చైర్మన్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏఏసీ వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని శివనాథ్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్ తో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
విజయవాడలో క్రికెట్ అకాడమీ స్థాపనకు కృషి చేస్తాం అని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. ఏపీ రాజధాని అమరావతితో పాటు విజయవాడ అభివృద్ధికి పాటుపడతాం అని తెలిపారు. నేడు విజయవాడలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అథిదులుగా హజరయ్యారు. ఈ ఇద్దరిని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. ఆత్మీయ సమావేశం సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ……
Kesineni Chinni: ఇవాళ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు కర్నూల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల రోజుల్లో ఏసీఏలో ఎన్నికలు జరుగుతాయన్నారు.
పదేళ్లపాటు బెజవాడ ఎంపీగా పనిచేసిన కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున బెజవాడ ఎంపీగా వరుస విజయాలు సాధించారు కేశినేని నాని. 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీ తరపున బరిలోకి దిగినా.. ఆయన సొంత సోదరుడు కేశినేని చిన్ని చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ పరాజయంతో తర్వాత అనేక సమాలోచనలు జరిపి చివరికి రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకు న్నట్టు కేశినేని…