కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారిక నివాసానికి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది. తంపానూర్ పోలీస్ స్టేషన్‌కు ఈమెయిల్ ద్వారా బెదిరింపు సందేశం అందింది. క్లిఫ్ హౌస్ దగ్గర బాంబు పేలుళ్లు జరుగుతాయంటూ ఇ-మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. వెంటనే పోలీసులు, అధికారులు అప్రమత్తం అయ్యారు. బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. చివరికి బూటకం అని తేల్చారు. అయితే మెయిల్ ఎవరు పంపించారో ఇంకా గుర్తించలేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Ramachandra Reddy: సీఎం చంద్రబాబుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
డాగ్, బాంబ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. కానీ అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీస్ అధికారి తెలిపారు. తనిఖీల సమయంలో ముఖ్యమంత్రి విజయన్, ఆయన కుటుంబం విదేశాల్లో ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కీలక సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఈమెయిల్ బెదిరింపులు వస్తున్నాయి. దీంతో అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Jharkhand: ఏంటీ 800 బాటిళ్ల మద్యాన్ని ఎలుకలు తాగాయా..? ఏం కవరింగ్ భయ్యా..