దేశంలోనే అత్యధిక విద్యావంతులున్న కేరళ అనేక విషయాల్లో అగ్రస్థానంలో ఉంది. సామాజిక భద్రత విషయంలో కేరళకు సాటి లేదు. దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన, విద్యావంతులైన రాష్ట్రంలో ఓ అవినీతి, కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాని గురించి వింటే మీరు షాక్ అవుతారు. కేరళలో బీఎండబ్ల్యూ కార్లు, ఏసీలు ఉన్న ఇళ్ల యజమానుల పేర్లను పేదల జాబితాలో చేర్చారు. పేదలకు ఇచ్చే పింఛనును వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆడిట్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. కేరళ సోషల్…
Kerala High Court: వామపక్ష సర్కార్ కు బిగ్ షాక్ తగిలింది. 2017లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాన్వాయ్‌లో వెళ్తుండగా నల్లజెండాలు ప్రదర్శించిన ముగ్గురు వ్యక్తులపై అభియోగాలను కేరళ హైకోర్టు రద్దు చేసింది.
Sabarimala: శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు రావడంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. ఇక, అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది.
Licence Cancelled: ప్రమాదంలో ఉన్న రోగులను తరలించేందుకు అంబులెన్స్‌ను అడ్డుకున్న ఓ కారు యజమానికి కేరళ ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించారు. అంతేకాదు అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసారు. ఈ ఘటనలో అతడికి ఏకంగా రెండున్నర లక్షల రూపాయలు ఫైన్ వేశారు ట్రాఫిక్ పాలీసులు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. డ్రైవర్ బాధ్యతారాహిత్యానికి పాల్పడినందుకు కేరళ పోలీసులు చేసిన పనికి వారికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలో రద్దీగా ఉండే రోడ్డుపై కారు వెళ్తోంది.…
Rahul Gandhi: కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ తన చెల్లెలు, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీకు సవాల్ విసిరారు. ప్రియాంక గాంధీ ఎంపీ అభ్యర్థి అని ఆయన అంటూనే.. ఆమె నా చెల్లెలు కూడా కాబట్టి, ఆమెపై వాయనాడ్ ప్రజలకు ఫిర్యాదు చేసే హక్కు నాకుంది. వయనాడ్‌కు నా హృదయంలో చాలా పెద్ద స్థానం ఉందని రాహుల్ అన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి…
రానున్న 36 గంటల్లో బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 12-15 వరకు అంటే నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత 24 గంటల్లో వాతావరణ నివేదిక ప్రకారం.. తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లలో ఉదయం దట్టమైన నుంచి చాలా దట్టమైన పొగమంచు నమోదైంది.
ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13న కేరళ, పంజాబ్, యూపీలో జరగాల్సిన ఉప ఎన్నికలను ఈనె 20వ తేదీకి వాయిదావేసింది. ఇప్పుడు నవంబర్ 20న జరగనున్నాయి. వివిధ పండుగల కారణంగా ఓటింగ్‌ను వారం రోజులు వాయిదా వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 13న జరగాల్సిన ఓటింగ్‌ను వాయిదా వేయాలని కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీలు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.