భార్యాభర్తల సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే దంపతులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో పచ్చని సంసారాలు మధ్యలోనే బుగ్గి పాలవుతున్నాయి. కలకాలం తోడుంటానని ప్రమాణం చేసిన వాళ్లు.. భాగస్వాములను కడతేర్చి బంధాలను తెంచుకుంటున్నారు. తాజాగా కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు ఓ భర్త. ఈ ఘోరం కేరళలోని కొల్లాంలో జరిగింది.
ఇది కూడా చదవండి: Hansika : నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సీనియర్ నటి కుమార్తె హవా
పద్మరాజన్ (50), అనిలా (44) భార్యాభర్తలు. కొంతకాలంగా ఇద్దరి మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. అయితే అనిలా ఈ మధ్య స్నేహితుడైన హనీష్‌తో ఉంటుంది. అతడితో కలిసి ఓ బేకరీని స్థాపించింది. అయితే ఈ వ్యవహారం భర్త పద్మరాజన్‌కు రుచించలేదు. ఇంట్లో తారాస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. అయితే మంగళవారం రాత్రి 9 గంటలకు అనిలా, స్నేహితుడు హనీష్‌తో కలిసి కారులో వెళ్తోంది. వారిని ఓమ్నీ వ్యాన్‌లో పద్మరాజన్ వెంబడించాడు. మార్గమధ్యలో అనిలా కారును పద్మరాజన్ ఢీకొట్టి వెంటనే వారిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. మంటల్లో అనిలా కాలిపోయింది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హనీష్ మాత్రం తీవ్రగాయాలతో బయటపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వచ్చి మంటలను అదుపు చేశారు. హనీష్‌ను ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పద్మరాజన్ మాత్రం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. హనీష్‌తో కలిసి బేకరీ ప్రారంభించడం పద్మరాజన్‌కు ఇష్టం లేకనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. విభేదాలు కారణంగా దంపతులు విడివిడిగా జీవిస్తున్నారు. దంపతులను కలిపేందుకు ఒకరు మధ్యవర్తిత్వం చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలుస్తోంది. ఇంకోవైపు భార్య అనిలా.. మరొకరితో కలిసి ఉండడం పద్మరాజన్ జీర్ణించుకోలేక.. ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: Honda Amaze 2024: హోండా కొత్త ‘అమేజ్’ వచ్చేసింది.. లీటర్‌కు రూ.19.46 కిమీ ప్రయాణం!