Congress MLA: కేరళలోని కలూర్ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజీపై సదరు ఎమ్మెల్యేతో పాటు నిర్వాహకులు, కార్యక్రమానికి వచ్చిన వారితో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత కుర్చీలో నుంచి లేచి పక్కకు వెళ్లే టైంలో ఆమె.. వేదికపై నుంచి జారి కింద పడిపోయారు.
New Governors: ఈరోజు (జనవరి 2) బీహార్, కేరళ రాష్ట్రాలకు కొత్తగా ఎన్నికైన గవర్నర్లు పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకూ కేరళ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఇవాళ బీహార్ గవర్నర్‌గా ప్రమాణం చేశారు.
కేరళ తిరువనంతపురంలోని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓ ట్యూషన్ టీచర్‌కు 111 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఓ కేసులో టీచర్ దోషిగా తేలాడు. మైనర్ బాలికను ప్రలోభపెట్టి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణపై అరెస్ట్ అయ్యాడు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. టీచర్‌ను దోషిగా తేల్చింది. జైలు శిక్షతో పాటు రూ.1.05 లక్షల జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 44 ఏళ్ల ఉపాధ్యాయుడు నిర్ణీత గడువులోగా జరిమానా చెల్లించకుంటే…
Kerala : కేరళలోని ఒక ప్రముఖ హిందూ సన్యాసి దేవాలయాలలో ప్రవేశించే పురాతన సంప్రదాయానికి స్వస్తి పలికారు. దేవాలయాలలో మగ భక్తుల పై వస్త్రాలను తొలగించే పద్ధతిని ఇక్కడ ముగించాలని చెప్పబడింది.
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన బయటకు వచ్చింది. వేగంగా వస్తున్న రైలు నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఓ వ్యక్తి పట్టాల మధ్యలో పడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఓ వ్యక్తి కన్నూర్ సమీపంలోని ట్రాక్ మధ్యలో పడుకోవడం.. రైలు అతనిపై నుంచి వెళ్ళడం చూడవచ్చు. ఈ ఘటన సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కన్నూర్- చిరక్కల్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది.
Kerala High Court: ఆసుపత్రులు "ఆధునిక సమాజంలోని దేవాలయాలు" అని, కఠినమైన చట్టపరమైన చర్యల ద్వారా విధ్వంసం నుండి రక్షించబడాలని కేరళ హైకోర్టు నొక్కి చెప్పింది. డిసెంబర్ 07న కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఆయుర్వేద ఆస్పత్రి ధ్వంసం చేసి, రూ. 10,000 నష్టానికి కారణమైన కేసులో నిందితుడైన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
Gold And Silver Rates: పసిడి ప్రియులకు శుభవార్త. గత కొంతకాలంగా రాకెట్ వేగంతో దూసుకు వెళ్లిన బంగారం ధరలు.. ఇప్పుడిప్పుడే తగ్గుతున్నట్లుగా కనబడుతోంది. బంగారంతో పాటు మరోవైపు వెండి కూడా నేల చూపులు చూస్తోంది. ఇదివరకు బాగా తగ్గిన బంగారం ధరలు, గత వారంలో మళ్లీ పెరగడం జరిగింది. అయితే, ప్రపంచ పరిస్థితుల నడుమ బంగారం ధరలు మళ్ళీ తగ్గు ముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో 22 క్యారెట్ల బంగారం 10…
Monkeypox: కేరళలో ఇద్దరికి మంకీపాక్స్(ఎంపాక్స్) కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ బుధవారం తెలిపారు. ఇద్దరు కూడా ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి ఇటీవల కేరళకు తిరగి వచ్చారు. ఇద్దరు వ్యక్తులను పరీక్షించగా ఎంపాక్స్ పాజిటివ్‌గా తేలిందని ఆమె చెప్పారు. వయనాడ్ జిల్లాకు చెందిన వారిలో ఒకరికి మొదటగా వ్యాధి సోకినట్లు గుర్తించగా, కన్నూర్‌కి చెందిన మరో వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. Read Also: Bandi Sanjay: రూ.224 కోట్ల సీఆర్ఐఎఫ్…
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చిరకాల అనుచరుడు పీపీ మాధవన్ (73) సోమవారం మృతి చెందారు. మాధవన్‌ను న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చగా.. గుండెపోటుతో మరణించాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. మాధవన్ చాలా సంవత్సరాలు సోనియా గాంధీకి సహాయకుడిగా పనిచేశాడు. అంతకుముందు రాజీవ్ గాంధీతో కూడా కలిసి పనిచేశారు.