Rahul Gandhi: కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ తన చెల్లెలు, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీకు సవాల్ విసిరారు. ప్రియాంక గాంధీ ఎంపీ అభ్యర్థి అని ఆయన అంటూనే.. ఆమె నా చెల్లెలు కూడా కాబట్టి, ఆమెపై వాయనాడ్ ప్రజలకు ఫిర్యాదు చేసే హక్కు నాకుంది. వయనాడ్‌కు నా హృదయంలో చాలా పెద్ద స్థానం ఉందని రాహుల్ అన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి…
రానున్న 36 గంటల్లో బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 12-15 వరకు అంటే నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత 24 గంటల్లో వాతావరణ నివేదిక ప్రకారం.. తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లలో ఉదయం దట్టమైన నుంచి చాలా దట్టమైన పొగమంచు నమోదైంది.
ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13న కేరళ, పంజాబ్, యూపీలో జరగాల్సిన ఉప ఎన్నికలను ఈనె 20వ తేదీకి వాయిదావేసింది. ఇప్పుడు నవంబర్ 20న జరగనున్నాయి. వివిధ పండుగల కారణంగా ఓటింగ్‌ను వారం రోజులు వాయిదా వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 13న జరగాల్సిన ఓటింగ్‌ను వాయిదా వేయాలని కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీలు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
Sabarimala: కేరళ ప్రభుత్వం శబరిమలకు వచ్చే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది మండలం- మకరవిలక్కు యాత్రా సీజన్లో శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఉచిత బీమా కల్పించనుంది.
దక్షిణాదిలోని పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా శనివారం, ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది.
Priyanka Gandhi: కేరళలోని వాయనాడ్‌లో జరగనున్న లోక్‌సభ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నవంబర్ 3 నుంచి మళ్లీ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నవంబర్ 3న ప్రియాంక గాంధీ తన సోదరుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ప్రియాంక గాంధీ వయనాడ్ పర్యటన గురించి శుక్రవారం సమాచారం ఇస్తూ.. నవంబర్ 7 వరకు కేరళలో ఉంటారని కాంగ్రెస్ తెలిపింది. ఈ సందర్భంగా ఆమె ఎన్నికల ప్రచారంతో పాటు…
Waqf Issue: కేరళలో ‘వక్ఫ్’ వివాదం రాజుకుంది. తమ భూమిపై వక్ఫ్ బోర్డు క్లెయిమ్‌పై ఎర్నాకులం జిల్లాలోని మునంబం గ్రామంలోని 610 కుటుంబాలు ఆందోళన చేస్తున్నాయి. ఆందోళన చేస్తున్న బాధితులకు కేంద్ర మంత్రి సురేష్ గోపి మద్దతు తెలిపారు. బుధవారం వీరిని కలిసి పరామర్శించారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ కుటుంబాలు వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తున్న వారి భూమికి రెవెన్యూ హక్కుల్ని డిమాండ్ చేస్తున్నారు.
దీపావళి పండుగను భారతదేశంలో వైభవంగా జరుపుకుంటారు. హిందూ మతంలో దీపావళి పండుగకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గణేశుడిని, లక్ష్మి దేవిని పూజిస్తారు. దీనితో పాటు ప్రజలు తమ ఇళ్లలో దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా దీపావళి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అయితే... దీపావళి పండుగను భారతదేశంలో పలు ప్రాంతాల్లో జరుపుకోరు. అక్కడ పటాకులు కూడా కాల్చరు.