Retirement Age Hike: ఉద్యోగులకు శుభవార్త. వారి పదవీ విరమణ వయస్సును ఐదేళ్లు పెంచారు. దీంతో ఇప్పుడు ఉద్యోగులు 65 ఏళ్ల వరకు సర్వీస్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది.
MLA Rajaiah: జనగామ జిల్లా స్టేషన్ ఘనపు నియోజకవర్గం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందస్తుగా ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో మార్పులు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు.
Rural Constable: ఉస్మానియా యూనివర్సిటీలో గ్రామీణ కానిస్టేబుల్ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 46 సవరణ చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు.
స్టేషన్ ఘన్పూర్లో సొమ్మొకడిది సోకొకడిదిగా అన్నట్లుగా పరిస్ధితి మారిందని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శలు చేశారు. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ కాకుండా ఎవరు అడ్డుపడ్డారో అందరికీ తెలుసునని.. మేం చేసిన పనులను తామే చేశామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్ధితి నెలకొందని మండిపడ్డారు.
రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలు పాలు అయ్యాడు.. తప్పు చేసింది ఎవరైనా సరే జైలుకు వెళ్ళక తప్పదు సీఎం కేసీఆర్ కు ఆది మినహాయింపు కాదు అని ఆయన వ్యాఖ్యనించారు.
నల్లగొండ జిల్లాలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. మా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. సలహాలు, సూచనల వరకే పరిమితం అవుతాను.. మూడవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.. పార్టీలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండటం సహజం.
బీజేపీ ఉమ్మడి మెదక్ జిల్లాలో రేపటి ఎన్నికల కోసం సిద్ధం అవుతుంది అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారు..
ఎన్నికల నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం బియ్యం అమ్మకానికి పెట్టింది అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. కస్టమ్ మిల్లర్ల నోట్లో మట్టి కొట్టే పని చేశారు.. వేయి కోట్ల టర్నోవర్, వంద కోట్ల లాభం ఉన్న మిల్లర్లు మాత్రమే పాల్గొనాలి అని కండిషన్ పెట్టారు.. ఎమెఎస్పీ కన్నా ఎక్కువకు టెండర్లు పోతే ఒకే.. తక్కువకు పోతే మాత్రం రాష్ట్రానికి తీవ్ర నష్టం
హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార్ లో మున్నూరు కాపు ప్లీనరి సన్నాహక సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి గంగుల కమలాకర్ పాల్గొనగా.. ఎంపీ రవిచంద్ర, కాంగ్రెస్ నేత వీహెచ్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బొంతు రామ్మోహన్, మున్నూరు కాపు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.