Gutha Sukender Reddy: తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందన్నారు. తాను పార్టీ మారాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాను రాజ్యాంగ శాసన మండలి చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని, తనకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పారు.
Ponnam Prabhakar: కేసీఆర్ కు లోపల ట్రీట్మెంట్ జరుగుతుందని రవాణా, బీసీ సంక్షేమం శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందుకే కేసీఆర్ ను కలవలేదని తెలిపారు.
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఇటీవలే తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన కేసీఆర్ ను రేవంత్ రెడ్డి సహా ఇతర మంత్రులు పరామర్శించనున్నారు.
KCR Health News: ఎర్రవెల్లి ఫాంహౌస్లోని బాత్రూమ్లో జారి పడిన కేసీఆర్ ప్రస్తుతం హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలి ఎముక విరిగిపోవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి ఎముకను మార్చారు.
KTR: తెలంగాణ అసెంబ్లీ కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ అసెంబ్లీలో ప్రమాణం చేయిస్తున్నారు.
కేసీఆర్ కు నాలుగు గంటలకు పైగా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన యశోద ఆస్పత్రి వైద్యులు.. మేజర్ సర్జరీ కావడంతో మరింత పర్యవేక్షణ అవసరం అవుతుంది అని డాక్టర్లు తెలిపారు.
BRSLP Leader: కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ శాసనసభ్యులు తమ పార్టీ అధినేతగా మాజీ సీఎం కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశరావు అధ్యక్షతన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది.
BRS: బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా మాజీ సీఎం కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ తరఫున శాసనసభకు ఎన్నికైన 38 మంది ఎమ్మెల్యేలు ఇవాళ ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో సమావేశమవుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ ముగిసింది. యశోదా హాస్పిటల్ లో కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. నాలుగు గంటలకు పైగా కేసీఆర్ కు డాక్టర్లు సర్జరీ చేశారు. యశోద డాక్టర్ల ఆధ్వర్యంలో కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసింది .ఈ క్రమంలో.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై మరికాసేపట్లో యశోదా హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేయనుంది.
తిరుపతి జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, వరద బాధితులను పరామర్శించారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ. తీర ప్రాంతమైన సూళ్లూరుపేట నియోజకవర్గంలో తుఫాన్ దెబ్బకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూస్తే మనసు కలిచి వేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.