తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రి 2గంటల సమయంలో బాత్రూంలో కాలుజారి పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కేసీఆర్ ఎడమకాలు తుంటి ఎముక విరిగిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. కాగా.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ట్వీట్ చేశారు. "తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గాయపడటం బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని…
Harish Rao: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శించేందుకు ఎవరూ ఆస్పత్రికి రావద్దని మాజీ మంత్రి హరీశ్రావు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
BIG Breking: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గాయపడ్డారు. దీంతో వెంటనే సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అయితే గురువారం అర్ధరాత్రి కేసీఆర్ తన ఫామ్హౌస్లో జారి పడిపోయినట్లు సమాచారం.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జడ్పీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి సంతాప సభలో పాల్గొన్న అనంతరం ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నారు.. బీఆర్ఎస్ సర్కార్ రావడం పెద్ద ఇబ్బంది కాదని తెలిపారు. కేసీఆర్ సింహాలా బయటకు వస్తారని.. సమయం చెప్పలేమని అన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైన తర్వాత ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓటమి చెందిన దగ్గరి నుంచి కేసీఆర్ అక్కడి నుంచి బయటకు రాలేదు. ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కాగా.. ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఫామ్ హౌస్ లోనే సమావేశమయ్యారు. అయితే.. ఈరోజు కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు ఆయనను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వచ్చారు.
సింగరేణి ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ. వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కింగర్ల మల్లయ్య హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. ఈ సందర్భంగా.. అనుసరించాల్సిన వ్యూహాలు, సన్నద్ధత గురించి చర్చలు జరిపారు. సింగరేణి సంస్థలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్పూర్తితో నాయకత్వ సారధ్యంలోనూ యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కేసీఆర్ ని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
కొమురంభీం జిల్లా కాగజ్నగర్ లో బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సిర్పూర్ లో గెలిచిన బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరిష్ బాబుకు అభినందనలు తెలిపారు. అ