రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయాల్లో మార్పు వచ్చింది.. తెలంగాణలో భాష మారబోతోంది.. ఇక, నీచమైన రాజకీయాలకు స్వస్తి పలకాలి అని ఆయన కోరారు.
ఒక సిట్టింగ్ సీఎంను.. కాబోయే సీఎం అంటున్న ఇద్దరినీ ఓడించిన ఘనత బీజేపీ దే అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డినీ ఓడించిన వెంకట రమణ రెడ్డి విజయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలిపారు అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది.. అయితే, కాంగ్రెస్ వేవ్లోనూ దాదాపు 40 స్థానాలను అధికార బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం కల్పించడమే బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణమే ప్రచారం ఉంది.
బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ తమ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ముమ్మాటికీ 70 సీట్లకు పైగా బీఆర్ఎస్ గెలుస్తుందని దాసోజు శ్రవణ్ అన్నారు. మూడవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. తెలంగాణ ప్రజలతో కేసీఆర్ ది పేగు బంధం అని పేర్కొ్న్నారు. ఎగ్జిట్ పోల్ కు ఎగ్జాక్ట్ పోల్స్ కు మధ్య చాలా తేడా ఉంటుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నాడని చెప్పారు. కాంగ్రెస్ నేతలు లేకి తనం చూపిస్తున్నారు.. చిల్లర…
రాత్రి 11 గంటల వరకు పోలింగ్ నడిచిందని సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. పోలింగ్ నడుస్తున్న సమయంలో ఎగ్జిట్ పోల్స్ కు ఎన్నికల కమీషన్ ఎలా అనుమతించారు..? అని ప్రశ్నించారు. సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా సాయంత్రం 5 గంటలు దాటిన తరువాత 30 వేలకు పైగా ఓట్లు పోల్ అయ్యాయని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఎగ్జిట్ పోల్ ఎలా సరైందని విమర్శించారు. నూటికి నూరు శాతం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు.. సత్తుపల్లిలో నాల్గోసారి విజయం సాధిస్తున్నట్లు ధీమా…
Shabbir Ali: కేసీఆర్ మీడియా ముందుకు రాకుండా ఓటమిని అంగీకరించారని కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వారికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలన్నారు.
పోలింగ్ ముగిసిన అనంతరం.. గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం మీద ఎంత ద్వేషం ఉందో గజ్వేల్ లో తిరిగితే అర్థం అవుతుందని ఆరోపించారు. కేసీఆర్ చెప్పేది వేరు చేసేది వేరు.. నియంత లాగా వ్యవహారం చేశారని తెలిపారు. కేసీఆర్ ని ఓడించడానికి బలమైన నాయకుడు ఎక్కడ ఉంటే అక్కడ జనం ఓటు వేశారని తెలిపారు.
Telangana Top leaders to cast their votes in these polling stations: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా కొద్దీ గంటలు మాత్రమే మిగిలి ఉంది. గురువారం ఉదయం 7 గంటల నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఈ ఎన్నికల్లో సినీ హీరోలు ఎవెరెవరు ఎక్కడెక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అనే వివరాలు చూశారు కదా ఇప్పుడు నేతలు ఎక్కడెక్కడి నుంచి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రి…
కేటీఆర్ ఒక బచ్చ.. కాకా కృషిపై సోయి లేక మాట్లాడుతుండని కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ధ్వజమెత్తారు. మంగళవారం చెన్నూరులో ప్రచారం నిర్వహించిన వివేక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెన్నూరూలో కాకా ఫ్యామిలీ ఏం చేసిందని కేటీఆర్ మాట్లాడుతుండని మండిపడ్డారు. కేటీఆర్ ఒక బచ్చ.. తెలంగాణ ఉద్యమం ఎట్ల ప్రారంభమైంది, కాకా కృషి ఏందని సోయి లేక మాట్లాడుతుండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాకా వెంకటస్వామి తెలంగాణ వాది.. 1969లో తూటా దెబ్బలు తిన్నడు. ఉద్యమం కోసం…
తన సొంత ఇలాకాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సోమవారం కొడంగల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కొడంగల్ నాకు అస్థిత్వాన్ని ఇచ్చింది.. పోరాటాన్ని నేర్పింది అని అన్నారు. 20 ఏండ్లు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడానని తెలిపారు. ఈ కొడంగల్ గడ్డ... నా అడ్డా.. మీ బిడ్డ.. మీరు నాటిన మొక్క... రాష్ట్రానికి నాయకత్వం…