KCR: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం క్రమంగా కోలుకుంటోంది. ప్రమాదవశాత్తు జారిపడి తుంటి ఎముకకు బలమైన గాయం కావడంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే.
KCR: యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ రేపు డిశ్చార్జ్ కానున్నారు. అనంతరం అక్కడి నుంచి నంది నగర్ ఇంటికి కేసీఆర్ వెళ్లనున్నారు. సుమారు 6 రోజులుగా యశోద ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న
సోమాజిగూడ యశోద ఆస్పత్రి వద్ద మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మాజీ సీఎం కేసీఆర్ ను చూసేందుకు లోపలికి అనుమతించాలని నిరసనకు దిగారు. వారంతా.. సిద్దిపేట, సిరిసిల్ల నుంచి వచ్చిన వారిగా గుర్తించారు. అంతేకాకుండా.. ఆస్పత్రి ముందు లాంగ్ లీవ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో.. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా అస్సలు వినడం లేదు. మరోవైపు.. ఆస్పత్రి వద్ద ఇతర పేషంట్స్ కి ఇబ్బంది కలుగుతుందని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా కానీ..…
సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో మాజీ సీఎం కేసీఆర్ను మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ పరామర్శించారు. అనంతరం ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించేందుకు వచ్చామని తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు... బహుశా రెండ్రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని మంత్రులు పేర్కొన్నారు.
తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుకుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని.. త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తానని.. అప్పడివరకు సంయమనం పాటించి యశోద దవాఖానకు రావొద్దని తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ లో ఉన్నందున మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదని ప్రజలను వేడుకున్నారు కేసీఆర్.
Vijayshanti Tweet: కాంగ్రెస్ నేత విజయశాంతి మాజీ సీఎం కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు. ఈ మేరకు సోమవారం ఆమె ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలని ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ‘సుమారు 10 సంవత్సరాల తెలంగాణ ఖజానా మొత్తం కొల్లగొట్టి, 5 లక్షల కోట్ల అప్పు…
హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని ఆయన తెలిపారు.
Chiranjeevi visits KCR in Hospital : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని చిరంజీవి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు, అంతేకాక కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలోని 9వ అంతస్తులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. ఐదు రోజుల క్రితం కేసీఆర్ తన ఫామ్హౌస్లో జారిపడిన సంగతి అందరికీ తెలిసిందే. జారిపడగా తుంటి విరిగిన నేపథ్యంలో డాక్టర్ల సలహా మేరకు యశోద ఆసుపత్రిలో…
సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎంకేసీఆర్ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
సర్కారులో ఇబ్బందులను, బాధలను తెలియజేయడం శుభ పరిణామం అని ఆయన పేర్కొన్నారు. ప్రజా అభిమానం చూరగొనేలా పని చేయాలని చెప్పాను.. ప్రభుత్వంలో నా పాత్ర ఏమి ఉండదు అని జానారెడ్డి వెళ్లడించారు.