MLC Jeevan Reddy: కేటీఆర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు రేవంత్ కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. మాకు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నిలబడాలని ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలవాలని చూస్తుందన్నారు. కేటీఆర్ నీకి ఇంకా జ్ఞానోదయం కావడం లేదు.. మెడిగడ్డలో తప్పును సరి చేస్కో అని అన్నారు. దేశంలో 90 శాతం ప్రజలు లబ్ధిపొందే సంక్షేమ కార్యక్రమం 200 యూనిట్ ఉచిత విద్యుత్ అన్నారు. త్వరలో రేషన్ కార్డులు జరిచేస్తామన్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు ఇందిరమ్మ ఇండ్ల ఆర్థిక సహాయం పై విదివిధానాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే నాయకులు ఆడబిడ్డలను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు.
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు వెలికి తీసేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ మేడిగడ్డలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల బృందం పర్యటనకు బయలుదేరింది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో పార్టీ ఎమ్మెల్యేలు, శాసనమండలి, పార్లమెంట్ సభ్యులు, ఇతర ముఖ్య నేతలు మేడిగడ్డకు బయలుదేరారు. వారితో పాటు నీటిపారుదల నిపుణులు కూడా ఉన్నారు. మేడిగడ్డ పరీక్ష అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలించేందుకు వెళ్లనున్నారు. అక్కడ అన్నారంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబడుతుంది. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడదామని, వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని బీఆర్ఎస్ ఇవాల చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టిన విషయం తెలసిందే..
BJP Candidate List: నేడు బీజేపీ తొలి జాబితా.. లిస్ట్‌లో మోడీ, అమిత్ షా!