MLA Bandla Krishna Mohan: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కు ఊహించని షాక్ ఇచ్చారు ఇవాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి పార్టీలో కొనసాగుతానని బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. అసెంబ్లీ ఆవరణలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సరదాగా మాట్లాడుకున్నారు.
Read also: Manu Bhaker:స్వాతంత్ర్యానంతరం రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా రికార్డ్..
ఒకవైపు అధికార కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’తో ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేరుతున్నారు. ఈ తరుణంలో ఈ అనూహ్య పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఇప్పటివరకు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా.. కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 75 నుంచి 74కి పడిపోయింది. కాంగ్రెస్‌లో చేరిన వారిలో అరికెపూడి గాంధీ, తెల్లం వెంకటరావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం, డాక్టర్ సంజయ్, కాలేరు యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. కాగా.. మరికొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి యూ టర్న్ తీసుకోవడం గమనార్హం. స్థానిక కాంగ్రెస్ నేతలతో కృష్ణమోహన్ రెడ్డికి పొసగకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేసీఆర్‌ను కాంగ్రెస్‌లోకి పంపారని మరికొందరు వాదిస్తున్నారు. ఇలా చేస్తే కాంగ్రెస్ లోకి వలసలు తగ్గుతాయని అంటున్నారు.
TS Crime News: సోదరుడిని హత్య చేసి.. మృతదేహాన్ని బైక్‌పై తరలించారు! చివరకు