Harish Rao: కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు కు కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తోంది ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభానికి సన్నాహక సమావేశం పేరిట హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. రోజుకో మంత్రి వెళ్లి ప్రాజెక్టు సందర్శనలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు కు కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తోందన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల అభివృద్ధి ని తాము చేసినట్లుగా ఈ ప్రభుత్వం చూపించు కునే ప్రయత్నం చేస్తోందన్నారు. రిబ్బన్ కటింగ్ అవకాశం వచ్చిందని.. ప్రాజెక్టు నే తాము కట్టినట్లు కటింగ్ ఇస్తున్నారు.
Read also: Mufasa Movie: ‘ముఫాసా’ కోసం ఇద్దరు తనయులతో కలిసి రంగంలోకి షారుఖ్ ఖాన్!
ఈ నెల 15 న సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి ప్రారంభం చేయబోతున్నారని తెలిపారు. ప్రభుత్వం మారింది కాబట్టి ప్రారంభం చేసే అవకాశం రేవంత్ రెడ్డి కి దక్కిందన్నారు. మందికి పుట్టిన పిల్లల ను మాకు పుట్టారు అనే విధంగా ఈ ప్రభుత్వం తీరు ఉందన్నారు. సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ సహకారంతో పూర్తి అయింది అని ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు చెప్పారన్నారు. పబ్లిసిటీ స్టంట్ లు మానండి.. పాలన పై దృష్టి పెట్టండి అని నేను కోరుతున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ ఆదాయం పై ఉన్న శ్రద్ధ మిగతా అంశాలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్నారు. పబ్లిసిటీ కోసం ప్రయత్నం మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు.
AV Ranganath: హైడ్రా పై ఎమ్మెల్యేల కామెంట్స్.. రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు..