Jofra Archer: వైభవ్ సూర్యవంశీ విధ్వంసంను ఎలా ఆపాలి.. ఆర్ఆర్ పేసర్ ఆర్చర్ ఏం చెప్పాడంటే?
- వైభవ్‌కు నెట్స్‌లో బౌలింగ్ చేస్తా
- ఎక్కడ బంతులు వేస్తానన్నది మాత్రం చెప్పను
- నిజం చెప్పాలంటే వైభవ్ 150 పరుగులు చేయాల్సింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jofra Archer on Vaibhav Sooryavanshi Batting: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 8 వికెట్ల నష్టానికి 243 రన్స్ చేయగా.. ఛేదనలో ఎస్ఆర్హెచ్ 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. ఆర్ఆర్ విజయంలో వైభవ్ సూర్యవంశీ (97; 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సులు), జోఫ్రా ఆర్చర్ (3/58) కీలక పాత్ర పోషించారు. కీలక సమయంలో వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్‌ను కుదేలు చేసిన ఆర్చర్.. మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ బ్యాటింగ్, నెట్స్‌లో అతడికి ఎలా బౌలింగ్ చేస్తానన్న విషయంపై ఇచ్చిన సమాధానాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
జోఫ్రా ఆర్చర్ మాట్లాడుతూ… ‘నా బౌలింగ్ ఫిగర్స్ ఎలా ఉన్నాయన్నది పక్కన పెడితే.. నేను బాగానే బౌలింగ్ చేశానని అనుకుంటున్నాను. మా బౌలర్లు అందరూ మంచి ప్రదర్శన చేశారు. మేము మా ప్రణాళికలకు కట్టుబడి ఉన్నాం. సరైన లెంగ్త్‌లలో బౌలింగ్ చేశాం. అందుకే ఫలితం కూడా మా వైపే వచ్చింది. పవర్‌ప్లేలో ఎక్కువ వికెట్లు తీసిన జట్టే ఎక్కువసార్లు మ్యాచ్ గెలుస్తుంది. ఆ సమయంలో ఒత్తిడి చాలా ఉంటుంది. కానీ నేను ఆ బాధ్యత తీసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. జట్టు కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను’ అని చెప్పాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ప్రస్తుతం టీ20 క్రికెట్లో విధ్వంసక బ్యాటర్లను ఎలా కట్టడి చేస్తారనే ప్రశ్నకు ఆర్చర్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘హిట్టర్లకు బౌలింగ్ చేయాలంటే నర్వ్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి. మంచి బంతులు వేసినా బౌండరీలు వెళ్తాయి. చెత్త బంతులు వేసినా బౌండరీలే. కాబట్టి వికెట్లు తీయాలనే ఆలోచనతోనే బౌలింగ్ చేయాలి. కేవలం ఓవర్లు పూర్తి చేయాలని బౌలింగ్ చేస్తే వర్కౌట్ కాదు’ అని వివరించాడు. వైభవ్ బ్యాటింగ్‌ను డగౌట్లో నుంచి చూడటం ఎలా అనిపించిందన్న ప్రశ్నకు ఆర్చర్ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ‘చాలా ఎంజాయ్ చేశాం. అతడు ఎన్ని ఎక్కువ పరుగులు చేస్తే.. మాకు డిఫెండ్ చేసేందుకు అంత పెద్ద స్కోర్ ఉంటుంది. నిజం చెప్పాలంటే వైభవ్ 150 పరుగులు చేయాల్సింది. కానీ సెంచరీ ముందు అవుట్ అయ్యాడు. వైభవ్ బాగా ఆడితే జట్టుకు చాలా ఉపయోగంగ ఉంటుంది’ అని తెలిపాడు.
నెట్స్‌లో వైభవ్‌కు బౌలింగ్ చేస్తారా?, ఎక్కడ బంతులు వేస్తారు? అని అడగగా.. ఆర్చర్ చిరునవ్వులు చిందించాడు. ‘కొన్నిసార్లు బౌలింగ్ చేస్తాను. కానీ ఎక్కడ బంతులు వేస్తానో ఐపీఎల్ అయ్యాక చెబుతాను. ఇప్పుడే చెబితే ప్రత్యర్థులు అతడిని కట్టడి చేస్తారు. మాకు ఇంకా రెండు కీలక మ్యాచులు ఉన్నాయి’ అంటూ సరదాగా తప్పించుకున్నాడు. ఆర్చర్ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్వాలిఫయర్-2 ముందు జట్టు ఆత్మవిశ్వాసంపై మాట్లాడుతూ.. ‘మేము సరైన సమయంలో సరైన దిశలో వెళ్తున్నాం. ఒక్కో మ్యాచ్‌ను ఆడుకుంటూ ముందుకు వెళ్తున్నాం. గతంలో పంజాబ్ కింగ్స్‌కు జరిగినట్టు మాకు జరగకూడదనుకుంటున్నాం. ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని జట్టుకు సహాయం చేస్తున్నారు. అదే మా అసలైన బలం’ అని చెప్పాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే కీలక పోరులో కూడా ఇదే జోరు కొనసాగించాలని ఆర్ఆర్ భావిస్తోంది.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!