Harish Rao : క్రిస్మస్ను అధికారికంగా నిర్వహించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. ప్రతి క్రిస్మస్కు పేద క్రిస్టియన్ సోదరులకు గిఫ్ట్‌లు అందించడం ప్రత్యేకమైనది అని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులపై కేసీఆర్ చేసిన ప్రయత్నాలు, ఎంత బాగా చూసుకున్నారో అందరికీ తెలుసని చెప్పారు. మెదక్ చర్చి వందేండ్లు పూర్తి అవడాన్ని పురస్కరించుకుని హరీష్ రావు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. భూభారతి బిల్లుపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్షం అహంభావంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. సభాపతి మీదనే దాడి చేసి చర్చను అడ్డుకునే ధోరణిలో ఉందని అన్నారు.
రేవంత్‌రెడ్డి సర్కార్‌పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్.. 7 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోతే.. రేవంత్ సర్కార్ వచ్చన తర్వాత మరో లక్ష కోట్లు పెరిగాయన్నారు.
ఓఆర్ఆర్ టెండర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిట్ విచారణకు ఆదేశించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
కాళేశ్వరం కమిషన్ వద్ద మాజీ సీఎస్ ఎస్కే జోషి, మాజీ ఐఏఎస్ రజత్ కుమార్ బహిరంగ విచారణ ముగిసింది. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఓపెన్ కోర్ట్ విచారణకు రిటైర్డ్ సీఎస్, రిటైర్డ్ ఇరిగేషన్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషి హాజరయ్యారు. తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించింది. అక్కడ నీటి లభ్యత ఎక్కువ లేదని సీడబ్ల్యూసీ చెప్పిందన్న ఎస్కే జోషి కమిషన్‌కు తెలిపారు.
MLC Kavitha: బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ మీడియా పాయింట్లో చేసిన ప్రెస్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ఆమె మాట్లాడుతూ, “మేము మండలిలో అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తప్పుడు సమాధానాలు ఇస్తోందని, నిన్న రాత్రి జరిగిన మూసీ ప్రాజెక్టు విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు తప్పుదోవ పట్టించారని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి మూసీ కోసం డబ్బులు అడగలేదని శ్రీధర్ బాబు చెబుతున్నారు. కానీ, సెప్టెంబర్ 2024లో…
Telangana Assembly Live 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పలు బిల్లులపై సభలో చర్చ జరగనుంది. ముందుగా ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతి, ఊకే అబ్బయ్య, రామచంద్రారెడ్డిలకు సభ సంతాపం తెలియజేశారు.
ఐదుగురు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క రోజూ సభకు వచ్చారని.. 38 మంది ఉన్న బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుందన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖతం అవుతుంది అని కేసీఆర్ ముందే తెలుసుకొని సభకు రావడం లేదన్నారు.