KP Vinekananda : మెట్రో ప్రాజెక్టును శామీర్ పేట, మేడ్చల్ వరకు విస్తరిస్తామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రకటన చేశారని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం మెట్రో మూడో దశ విస్తరణకు సంబంధించి నిర్ణయం తీసుకుందన్నారు కేపీ వివేకానంద. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో మూడో దశ విస్తరణకు కన్సల్టెంట్ ను కూడా కేసీఆర్ ప్రభుత్వం నియమించిందని, రేవంత్ రెడ్డి అధికారం లోకి వచ్చి రాగానే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలని మెట్రో విస్తరణ ప్రాజెక్టు ను రద్దు చేశారన్నారు. ఏడాది గా రేవంత్ నిర్ణయాలన్నీ తిరోగమన చర్యలే అని ఆయన మండిపడ్డారు. ఏడాదిగా మెట్రో పై కాలయాపన చేసి నిన్న కేసీఆర్ ప్రభుత్వం లో తీసుకున్న నిర్ణయాన్నే ప్రకటించారని, హైదరాబాద్ ను వరల్డ్ క్లాస్ సిటీ గా మార్చేందుకు కే టీ ఆర్ రోడ్ మ్యాప్ ను తయారు చేశారన్నారు కేపీ వివేకానంద. ఏడాదిగా కేసీఆర్ హయం లో తీసుకున్న నిర్ణయాలు అమలు చేసి ఉంటె తెలంగాణ పురోగమన దిశలో ఉండేదని, కేవలం తన అహం తో రేవంత్ కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టు లను ఆపారన్నారు. నిన్న కాంగ్రెస్ నేతలతో తాను మారిన మనిషినని రేవంత్ చెప్పినట్టు వార్తలు వచ్చాయని, అంటే ఏడాది కాలం లో తన చర్యలు తప్పు అని రేవంత్ ఒప్పుకుంటున్నారన్నారు కేపీ వివేకానంద.
Introverts Day: ప్రతిదానికి మొహమాటపడిపోతున్నారా? వారిని ఏమంటారంటే..
అంతేకాకుండా..’మెట్రో తాజా ప్రతిపాదనలు బీ ఆర్ ఎస్ సాధించిన విజయం.హైదరాబాద్ ఉత్తరం లో మెట్రో ప్రాజెక్టును విస్తరించాలని ప్రజలు చేసిన ఉద్యమానికి సీఎం మెడలు వంచక తప్పలేదు. రాయదుర్గ్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో విస్తరణకు కూడా రేవంత్ పూనుకోవాలి. పది లక్షల మంది ఐటీ ఉద్యోగులున్న ప్రాంతం లో మెట్రో విస్తరణ గురించి ఎందుకు ఆలోచించరు. జేబీఎస్ నుంచి శామీర్ పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ కు సీఎం రేవంత్ శంఖు స్థాపన చేసినా ఇప్పటివరకు తట్టెడు మట్టి తీయలేదు. శామీర్ పేట ,మేడ్చల్ వరకు మెట్రో విస్తరణ పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పాలి. కేంద్రం నుంచి సాయం వస్తేనే పనులు చేపడతామని అనడం సరికాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం!