తెలంగాణలో ఉప ఎన్నిక వేడి బాగా రాజుకుంది. మరో రెండురోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన టీఆర్ఎస్ 88 సీట్లు సాధించింది. ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలిసినవే. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఆతర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్ఎస్ను ఇబ్బందుల్లోకి నెట్టిందనే చెప్పాలి. బలమైన స్థానంలో ఓటమి పాలయింది. దీంతో పతనం మొదలైపోయిందన్న మాటలు వినిపించాయి. అయితే ఆవెంటనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికతో…
ఏపీ మంత్రి పేర్నినాని కేసీఆర్ ఫ్లీనరీ సందర్భంగా మాట్లాడిన మాటలపై స్పందించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన పేర్ని నాని కేసీఆర్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కేసీఆర్ పార్టీ పెట్టాలని కోరుకుంటున్నామని, రెండు రాష్ట్రాలలో పార్టీ ఎందుకు, దానికన్నా తెలంగాణ క్యాబినెట్లో రెండు రాష్ట్రాలను కలిపే తీర్మానం ప్రవేశపెట్టాలని వ్యంగంగా మాట్లాడారు. కేసీఆర్‌కు ఏపీలో పార్టీ పెట్టాలని అంత కోరికగా ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌పై మీడియా సమావేశంలో మంత్రి పేర్ని…
హుజురాబాద్ ఉప ఎన్నికకు ఈ రోజు సాయంత్రంతో ప్రచార సమయం ముగియనుంది. దీంతో నాయకులు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ.. ఓటర్లను తిప్పుకునేందుకు చివరి ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌లో ఓటమి ఖాయమని తెలిసి ప్రస్టేషన్‌తో కొంతమంది ఫోన్లు పగలకొడుతున్నారట అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు మాపై ఇచ్చిన ఫిర్యాదులతో మేము ఉన్న ఇండ్లను అధికారులు తనిఖీలు చేశారని ఆయన అన్నారు. మా ముఖ్యమంత్రి సభ పెట్టకుండా…
హుజురాబాద్ ఉప ఎన్నికపై ఆ నియోజకవర్గ ప్రజలే కాదు.. యావత్తు రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోంది. భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో ఆత్మగౌరవం అంటూ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీలో చేరిన నాటి నుంచే ఈటల హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హుజురాబాద్‌లో టీఆర్ఎస్…
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతోంది. ఈ రోజు సాయంత్రంతో ఉప ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు నాయకులు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ని గెలిపించే బాధ్యత మీది.. హుజురాబాద్ అభివృద్ధి మాది అంటూ వ్యాఖ్యానించారు. కమలాపూర్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని…
బహుజనుల స్వయం పాలన ప్రతిజ్ఞ సభకు హాజరైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధికార టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో లక్షలాది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి టీఆర్ఎస్ 20 ఏళ్ల విజయోత్సవాలు నిర్వహించుకోవడం సిగ్గుచేటన్నారు. ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు గొర్లు, బర్లు, చేపలు పంపిణీ చేస్తూ బీసీలను కులవృత్తులకు పరిమితం చేస్తున్నందుకా, టీఆర్ఎస్ విజయోత్సవాలు నిర్వహించేది ఎందుకని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. వందలాది మంది విద్యార్థి అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ కేసీఆర్…
హుజురాబాద్‌లో ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీలు ప్రచార జోరును పెంచుతున్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా మంగళవారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ తరుణ్ చుగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే బీజేపీ ఈటల గెలిస్తే నియోజకవర్గానికి వచ్చే పనులను వివరించారు. తరుణ్ చుగ్ మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం హుజురాబాద్ ప్రజలను, రాష్ట్ర ప్రజలను అవమానించిందని, కుక్కను పెట్టినా గెలుస్తామని అన్నారన్నారు. ఈ ఎన్నికల్లో…
టీఆర్ఎస్ ఫ్లీనరీ సమావేశంపై కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం మొత్తం.. వారి పొగడ్తలకే సరిపోయింది. అమరులను ఒక్కరినీ గుర్తు చేసుకోలేదని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూసీ కాల్వలో మురికి ఎంతుందో.. టీఆర్ఎస్ నేతల అవినీతి అంతలా పేరుకుపోయిందన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌కు వందల ఎకరాల భూమి , ఇతర దేశాల్లో…
తెలంగాణ విద్యుత్ రంగంలో దూసుకుపోతుంటే, ఏపీ చీకట్లో మగ్గుతోందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం సిగ్గుపడాలన్నారు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ. 2014-19లో చంద్రబాబు ఏపీని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారిస్తే, ఈ సీఎం అంతా అంధకారం చేశారని మండిపడ్డారు. విద్యుత్ లేనందున రాష్ట్రానికి పరిశ్రమలు కూడా రావడంలేదు. ఏపీలో భూముల విలువ పడిపోయిందని, కరెంట్ కోతలు ఉన్నాయని కేసీఆర్ హేళన చేస్తుంటే, జగన్ ఎందుకు స్పందించరు..? కేసీఆర్‌కు శాలువాలు కప్పితే, ఏపీ అభివృద్ధి చెందదని ముఖ్యమంత్రి గ్రహించాలి.…
తెలంగాణ పేరు వినిపిస్తేనే నిర్బంధం నుంచి గొంతు పిక్కటిళ్లేలా జై తెలంగాణ నినాదం ఎత్తుకున్న వరకు ఉద్యమనేతగా… తెలంగాణ సాధకుడిగా అశేష ఖ్యాతి సాధించిన కేసీఆర్.. మరో ఘనత సాధించారు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ ఉద్యమంతో తెలంగాణ సాధించి.. స్వరాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదిగిన కేసీఆర్ మరో సారి అరుదైన ఘనతను సాధించారు. టీఆర్ఎస్ ప్లీనరీలో.. మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దేశంలో.. అత్యధికాలం పాటు ఒక పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగిన నేతల జాబితాలో చేరారు కేసీఆర్. హైదరాబాద్…