రాష్ట్రానికి కేసీఆర్ ఏం చేశారు: షర్మిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ రాష్ట్రానికిఏం చేశారో చెప్పాలని పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ టీపీ వ్యవస్థాపకురాలు షర్మిళ అన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆమె కేసీఆర్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉచిత విద్యంటూ విద్యార్థులను, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను, వడ్డీ లేని రుణాలంటు డ్వాక్రా మహిళలను, రైతులను, రిజర్వేషన్లు పెంచుతానని మూడెకరాల భూమి ఇస్తానని ఎస్సీ ఎస్టీలను, డబుల్ బెడ్రూంలు ఇస్తానని పేదలను మోసం చేశారని ఆమె అన్నారు. మంచోడు మంచోడు అంటే మంచం కోళ్లు ఎత్తుకెళ్లారట కేసిర్ లాంటోళ్లు అని షర్మిళ విమర్శించారు.
నీళ్లు కేసీఆర్ ఫాo హౌస్ కే, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంటికే పరిమితం అయ్యాయన్నారు. ఎప్పుడు ఆలోచించాడు కేసీర్ రాష్ట్ర ప్రజల గురించి, ఎప్పుడు వెళ్ళాడు సెక్రెటేరియట్‌కు, ఏమి చేశాడు నల్గొండ జిల్లాకు అంటూ కేసీఆర్‌పై షర్మిళ ఫైర్ అయ్యారు. వైస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో నల్గొండ జిల్లాకు 30 సార్లు వచ్చి ఈ జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించారన్నారు. ఎస్సెల్బీసీ సొరంగం, ఫ్లోరైడ్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసారు. ఎస్సెల్బీసీ ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేద్దామని పనులు మొదలు పెట్టారు, కానీ ఇప్పటి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో అవి నత్తనడకన నడుస్తున్నాయన్నారు.రూ.2000 కోట్లు కేటాయిస్తే పూర్తయ్యే ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం లేదు.
Also Read
వైస్సార్ సీఎంగా పనిచేసిన కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, మద్దతుధర లతో రైతులకు అండగా ఉన్నారు. పేదింటి పిల్లలు ఏమి చదివిన ఉచితంగా విద్యను అందించారన్నారు. ప్రపంచంలో ఏనాయకుడు ఆలోచించని విధంగా పేదల ఆరోగ్యం గురించి ఆలోచించి ఆరోగ్యశ్రీ, 108 ప్రవేశపెట్టారని షర్మిళ అన్నారు.
- Tags
- kcr
- Nallagonda
- Sharmila
- YSR TP
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!