భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గానికి నిర్వహించి ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిపై ఈటల రాజేందర్ గెలుపొందారు.
అయితే రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ కార్యాలయంలో ఈటల రాజేందర్ ప్రమాణం చేయనున్నారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం బీజేపీ లో చేరిన విషయం తెలిసిందే.