కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేసి 24 గంటలు గవక ముందే ఏం చేశాడని, ఆయన ఎమ్మెల్సీ పదవి ఇస్తు న్నారని హనుమంతరావు కేసీఆర్‌ను ప్రశ్నించారు. వెంకట్రామి రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంలో కేసీఆర్ ఆంతర్యం ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదు. మహిళ లకు మొండి చేయి చూపించారని ఆయన ఎద్దేవా చేశారు. సిద్ధిపేట కలెక్టర్ రాజీనామా చేసిన వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడo పై త్వరలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తానని వి. హనుమంతరావు వెల్లడించారు.