ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో మాటల యుద్ధ నడుస్తూనే ఉంది. ఇటీవల తెలంగాణ మంత్రులు ఢిల్లీ పెద్దలను ధాన్యం కొనుగోళ్లపై కలిసేందుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మంత్రులను అవమాన పరిచి ఢిల్లీ నుంచి పంపితే భవిష్యత్ లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. జాతీయ పార్టీల నేతలు ఢిల్లీకి పైరవీ ల కోసం వెళతారు కానీ.. మేము తెలంగాణ ప్రయోజనాల కోసం వెళతామంటూ ఆయన వ్యాఖ్యానించారు. అడుక్కోవడానికి మేము…
ఢిల్లీ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో ఉన్నారో లేదో తెలుసుకోకుండానే మంత్రులు ఢిల్లీకి వచ్చారా అంటూ విమర్శించారు.చావు డప్పు కొట్టించారు..ముఖ్యమంత్రికి అసలు సిగ్గుఉందా.. అంటూ ప్రశ్నించారు. రైతులు ఆందోళన చెందద్దని చెప్పిన సీఎం కేసీఆర్, పూటకో మాట మారుస్తూ వరి వేస్తే ఉరి” అని…
పేదలకు పట్టాలు ఇచ్చిన స్థలంలో నర్సింగ్ కాలేజీ కట్టడం సిగ్గు చేటని, మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో వైద్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటనకు ముందు బీజేపీ నాయకులతో పాటు, అఖిలపక్ష నేతలను అరెస్టు చేయడాన్ని డీకే అరుణ ఖండించారు. తను మంత్రిగా ఉన్నప్పుడు అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే, నేడు అదే స్థలం లో నర్సింగ్ కాలేజీ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం…
తెలంగాణలో మళ్ళీ ముందస్తు ఎన్నికలు రానున్నాయా? కేసీఆర్ గతంలోలాగే మళ్లీ ఎన్నికల నగారా మోగించనున్నారా? 2023లో రావాల్సిన ఎన్నికలు 2022లో ఎప్పుడైనా వస్తాయా? అవుననే అనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. సిద్ధంగా ఉండండి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు. రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించారు తెలంగాణ సీఎం కేసీఆర్. గతంలో ఆరునెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ…
పోలీసు శాఖలో కింది స్థాయి ఉద్యోగులుగా సేవలందిస్తున్న హోం గార్డులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూఇయర్ కానుకగా రాష్ట్రంలో హోంగార్డుల గౌరవ వేతనాన్ని పెంచనున్నట్టు ప్రకటించింది. హోంగార్డులకు గౌరవ వేతనం 30 శాతం పెంచుతూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోంగార్డులకు పెరిగిన వేతనాలు 2021, జూన్ నుంచి అమలు కానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం హోంగార్డులకు నెలకు రూ.22 వేల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటికే ఎన్నో సార్లు హోం…
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాసటగా నిలిచారు. ట్విట్టర్లో కేటీఆర్ను, @TelanganaCMO ను ట్యాగ్ చేస్తు కోమటి రెడ్డి విమర్శలు చేశారు. విద్యార్థులు కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ మేరకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గుర్తుపెట్టుకో కేసీఆర్ @TelanganaCMO &@KTRTRS … ఇంటర్ బోర్డు ఫెయిల్ చేసిన విద్యార్థులందరికీ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు వస్తుంది…వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్న మీకు & మీ…
తెలంగాణలో రాజకీయాలు వేడిని రాజేస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ మంత్రులు, ఎంపీలు, మరోవైపు తెలంగాణ బీజేపీ నేతల పర్యటనలతో రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణలో చలి చంపేస్తుంటే.. నేతలు వరి చుట్టూ రాజకీయాలను నడుపుతున్నారు. త్వరలో తెలంగాణ పర్యటనకు వస్తానన్నారు కేంద్ర హోం మంత్రి, బీజేపీ బాద్ షా అమిత్ షా. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని, కేసీఆర్ ట్రాప్ లో పడకండని హితవు పలికారు హోం మంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా కేసీఆర్తో…
వరి ధాన్యం కొనుగోలు అంశం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య అగ్గి రాజేస్తుంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై మరోసారి విమర్శలు చేశారు. కేంద్రమంత్రి పియూష్ గోయల్ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. రెండు రోజుల తర్వాత సీఎం కేసీఆర్ ఈ ధాన్యం కొనుగోలు అంశాన్ని లేవనేత్తారని… అంతకు ముందు ఈ విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు. సీఎం తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని విమర్శించారు.…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా 6 నెలల్లో ఉద్యోగాలను భర్తీ చేయాలని కూడా భావిస్తుంది. కాగ రాష్ట్రం లో మొత్తం అన్ని శాఖలలో 86 వేల ఉద్యోగాలు ఖాళీ గా ఉన్నాయని తెలుస్తుంది. అయితే అందులో కాంట్రాక్ట్, ఓట్ సోర్సింగ్ ఉద్యోగాలు మినహా మిగితా 55 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.…
తెలంగాణ రైతులు బాజాప్తాగా వరి వేయండని వైఎస్ షర్మిల అన్నారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఎడ్లూర్ ఎల్లారెడ్డిలో పర్యటించారు వైఎస్ షర్మిల. వడ్లు కొనకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు మున్నారు యాదయ్య కుటుంబాన్ని ఈ సందర్భంగా షర్మిల పరామర్శించారు. ఈ రైతు మరణానికి ప్రభుత్వమే కారణమని.. .ఓ వైపు రైతులను చంపుకుంటూ,మరోవైపు ధర్నాలు చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వానికి చావు డప్పు కొట్టాలని… వరి వేసుకోవడం…