బీజేపీ నేత వివేక్ వెంకట్ స్వామి తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. మహబూబాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎంపీ వివేక్ బీజేపీ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్ల చేయాలన్నారు. తమను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరుని రైతులు అర్థం చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రధాని ముందు చూపు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందన్నారు. థర్డ్ ఫ్రంట్ విషయం…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రికార్డు చెక్కు చెదరలేదు. 98 శాతం ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీ గా పోచంపల్లి అప్పట్లో చరిత్ర సృష్టించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కు 2019 జూన్ 3 న ఉప ఎన్నిక జరిగింది. మొత్తం ఓటర్లు 902 మంది ఉండగా 883 మంది ఓటు వేశారు. 848 ఓట్లు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి పడ్డాయి. ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు…
తెలంగాణలో పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితులు, రైతులు నష్టపోయిన తీరుపై ఎలాంటి పరిహారం ఇచ్చారో చెప్పాలని జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) రాష్ర్టప్రభుత్వాన్ని, కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశంచింది. దీనిపై 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సరైన అధ్యయనం చేయకుండానే ప్రాజెక్టును నిర్మించడంతో 50వేల ఎకరాలకు మేర సారవంతమైన పంట భూములు మునిగిపోయాయి. దీంతో రైతులతో పాటు కౌలు రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారని న్యాయవాది శ్రవణ్ NHRC…
రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు, నిధుల పంపిణీ అంశంపై అధికారులు ఇప్పటికే దృష్టి పెట్టారు. వీలైనంత వేగంగా రైతులఖాతాల్లో డబ్బులు జమ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఇప్పటికే ఏడున్నర వేల కోట్ల నిధులను… సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేశారు. డిసెంబర్ 15 అంటే రేపటి నుంచే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని సీఎం…
మూడు రోజుల సమ్మె జీతాన్ని ప్రతి కార్మికుడికి చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ అన్నారు. సోమవారం గోదావరిఖనిలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణిలో జరిగిన సమ్మె రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సమ్మెగా ఆయన అభివర్ణించారు. సింగరేణిలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి సమ్మెలో బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు. కానీ ఈ మూడు రోజుల సమ్మెలో బొగ్గు ఉత్పత్తి జరగలేదంటే యాజమాన్యం, రాష్ర్ట ప్రభుత్వ తీరును…
సీఎం కేసీఆర్ సోమవారం శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి బేగంపేటకు చేరుకుంటారు. 11.10కి ప్రత్యేక విమానంలో బయలుదేరి 12.30కు తమిళనాడులోని తిరుచి చేరుకుంటారు. హోటల్లో బస అనంతరం. రోడ్డు మార్గంలో శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 2.10కి ఆయన రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు చేయిస్తారు. 3 గంటలకు తిరుచి విమానాశ్రయానికి పయనమవుతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకుని, ఐటీసీ గ్రాండ్ చోళలో…
తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్లో మీడియాతో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఈడీ నోటీసుల భయంతోనే సీఎం కేసీఆర్ ఢిల్లీకి పరుగులు పెట్టారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, బీజేపీలోకి ఎవ్వరు వచ్చిన చేర్చుకుంటామని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు ఉంటాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాష్ర్టంలో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. పార్టీ ఆదేశిస్తే…
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రభుత్వం ఆదివారంతో రెండో పర్యాయం మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని సన్నద్ధం చేయడంతో పాటు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. డిసెంబరు 16న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించేందుకు కేసీఆర్ పరిపాలనలో కఠిన నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసేందుకు దృష్టిసారించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. జనవరి…
నూతన సచివాలయ నిర్మాణ పనులను పూర్తిచేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో వున్న సచివాలయ పనుల తీరుతెన్నులను గురువారం సీఎం కేసీఆర్ పరిశీలించారు. వేగవంతంగా జరుగుతున్న పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను సీఎం అభినందించారు. కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసుకుంటూ తుది మెరుగులకు సిద్ధమవుతున్న సచివాలయ భవన నిర్మాణ పనులను సీఎం…
2009, డిసెంబర్ 9కి తెలంగాణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరిన సమయంలో కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కేసీఆర్ దీక్ష ప్రారంభించారు. అప్పటికే ఆయన దీక్షలో ఉండి కొన్ని రోజులు అవుతుండగా ఆయన ఆరోగ్య పరిస్థితి సైతం రోజురోజుకు విషమిస్తుంది. దీంతో అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి చిందబరం తెలంగాణ ఏర్పాటు పై కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభించామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ…