కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, కాంగ్రెస్ ను నడిపించేది కేసీఆరేనని అన్నారు. అట్లాంటప్పడు కేసీఆర్ ను ఓడించడమే ధ్యేయమని చెబుతున్న నేతలు కాంగ్రెస్ లో ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణ కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భూమిపూజకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రానున్నారు. నాగులపల్లిలో రైల్వే కోచ్ తయారీ కేంద్రం, కొల్లూరులో డబుల్ బెడ్ రూం పనులకు సీఎం శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందుకు సంబంధించిన పనులను మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్, స్ధానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు.
ఈనెల 22న(గురువారం) ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పటాన్ చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ పర్యటన వివరాలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెల్లడించారు.
రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే పెన్షన్ ను విడుదల చేయాలని, ఉద్యోగులకు పీఆర్సీని ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. నమస్కారం అంటూ మొదలుపెడుతూ.. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పుకుంటున్న మీ ప్రభుత్వం అసలు వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని తెలిపారు.
CM KCR: యూపీఏ చట్టం కింద ప్రొఫెసర్ హరగోపాల్‌పై పెట్టిన దేశద్రోహం కేసును ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎంవో నుంచి తెలంగాణ పోలీసు శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. హరగోపాల్ సహా 152 మందిపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డీజీపీ అంజనీకుమార్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించినట్లు తెలుస్తోంది. హరగోపాల్ సహా పలువురు మేధావులపై ఉపా చట్టం కింద నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.…
Revanth Reddy: కేసీఆర్ పుట్టకపోయుంటే తెలంగాణ వచ్చేది కాదని కేటీఆర్ అన్న మాటలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ పుట్టకముందే తెలంగాణ ఉద్యమం పుట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ఏడాదిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తన సెటిల్ మెంట్ కోసమే.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నట్లు బండి సంజయ్ ఆరోపించారు. అటు మంత్రి కేటీఆర్ నలుగురు బీజేపీ కార్పొరేటర్ లు టచ్ లో ఉన్నారు అని అంటున్నాడు.. మాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్నారు. తాము రాజకీయ వ్యభిచారులం కాదని... బీజేపీలో చేరాలి అంటే రాజీనామా చేయాలన్నారు.
CM KCR: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు 'తెలంగాణ మెడికల్ డే' నిర్వహించనున్నారు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ లో అత్యాధునిక 2000 పడకల సూపర్ స్పెషాలిటీ కొత్త బ్లాక్‌కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు 24 జిల్లాల్లోని గర్భిణులకు కేసీఆర్ పౌష్టికాహార కిట్ల పంపిణీ తెలంగాణ వైద్య దినోత్సవ వేడుకల్లో తెలంగాణ ప్రధాన కార్యక్రమాలు జరిగాయి.
కేసీఆర్ అనాలోచిత విధానంతో రాష్ట్రం అప్పుల ఉబిలోకి పోయిదంటూ.. సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. రూ.4వేల కోట్లతో నీళ్లు అందించే అవకాశం ఉండగా.. మిషన్ భగీరథతో రూ.40 వేల కోట్ల అప్పులు చేశారని దుయ్యబట్టారు.
Komatireddy Venkat Reddy: కేసీఆర్ సర్కార్ పై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం కొన్ని మాసాలుగా భూములు తీసుకుంటున్నారని మండిపడ్డారు.