రైలు ప్రయాణికులకు అలర్ట్. డోర్నకల్-పాపట్‌పల్లి మధ్య చేపట్టిన నాన్ ఇంటర్ లాకింగ్ (ఎన్‌ఐ) పనుల కారణంగా కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఐదు రోజుల పాటు రైల్వే అధికారులు రద్దు చేశారు. అక్టోబర్ 14 నుంచి 18వ తేదీ వరకు కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ రవీందర్ ఓ ప్రకటనలో తెలిపారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. సికింద్రాబాద్-విజయవాడ (12713/12714)…
Mahabubabad Rain: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాలా చోట్ల రోడ్లు, రైలు పట్టాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురవడంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరి.. చెరువులను తలపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో కాజీపేట్ రైల్వే స్టేషన్(జంక్షన్)లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. రైల్వే పట్టాల పైకి నీరు రావడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.