రైలు ప్రయాణికులకు అలర్ట్. డోర్నకల్-పాపట్‌పల్లి మధ్య చేపట్టిన నాన్ ఇంటర్ లాకింగ్ (ఎన్‌ఐ) పనుల కారణంగా కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఐదు రోజుల పాటు రైల్వే అధికారులు రద్దు చేశారు. అక్టోబర్ 14 నుంచి 18వ తేదీ వరకు కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ రవీందర్ ఓ ప్రకటనలో తెలిపారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు.
సికింద్రాబాద్-విజయవాడ (12713/12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు (12705 /12706) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, కాజీపేట-డోర్నకల్-డోర్నకల్-కాజీపేట (67765/67766) పుష్‌పుల్ రైళ్లను అప్ అండ్ డౌన్ రూట్‌లో రద్దు చేసినట్లు మేనేజర్ రవీందర్ తెలిపారు. అదేవిధంగా సికింద్రాబాద్-గుంటూరు (17201/17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్ కాజీపేట-సికింద్రాబాద్ వరకే ప్రయాణించనున్నట్లు చెప్పారు.
Also Read: Vaibhav Suryavamshi: అప్పుడే ప్రమోషన్.. వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ!
అక్టోబర్ 16, 17వ తేదీల్లో భువనేశ్వర్-ముంబై-భువనేశ్వర్ (11020/11019) కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను వయా గుంటూరు మీదుగా దారి మళ్లించి నడిపిస్తున్నట్లు స్టేషన్ మేనేజర్ రవీందర్ తెలిపారు. ఈ నెల 16,18వ తేదీన కాకినాడ-షిర్డీ, షిర్డీ-కాకినాడ (17205 /17206) షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లను వయా నల్లగొండ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా దారి మళ్లించి నడిపిస్తున్నట్లు చెప్ప్పుకొచ్చారు. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాల్సి ఉందని పేర్కొన్నారు.