Padmavati Express: సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Padmavati Express: సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు అలుముకున్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలో రైలును నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టారు. బి4 బోగీలోని బ్యాటరీలో క్యాప్ లీక్ కావడంతో పొగలు వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది వెంటనే మరమ్మతులు చేపట్టారు. దీంతో దాదాపు 2 గంటల పాటు రైలు నిలిచిపోవాల్సి వచ్చింది. మరమ్మతుల అనంతరం రైలు యథావిధిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
Read also: IPL 2024 LSG vs PBKS: లక్నో సూపర్ జెయింట్స్ మొదటి విజయాన్ని అందుకుంటుందా..?!
Also Read
అసలు ఏం జరిగింది..
సికింద్రాబాద్ తిరుపతి పద్మావతి ఎక్స్ప్రెస్ రోజూలాగానే స్టేషన్ నుంచి బయలు దేరింది. అందరూ నిద్రలో ఉన్నారు. అయితే B4 కోచ్ లో పొగలు రావడం మొదలయ్యాయి. రైల్వే సిబ్బంది గుర్తించి కాజీపేట రైల్వేస్టేషన్ రాగానే వెంటనే రైలును నిలిపివేశారు. కాజీపేట రైల్వే టెక్నీకల్ సిబ్బంది, అధికారులు చేరుకుని పొగలు రాకుండా వాటిని మరమ్మత్తు చేశారు. ఈ ఘటనతో కాజీపేట రైల్వేస్టేషన్ లో సుమారు గంటన్నర నిలిపివేయడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో కాసేపు ఏమీ అర్థం కాలేదు. అధికారులకు నిలదీయగా రైలులో పొగలు వ్యాపించాయని తెలుపడంతో భయాందోళనకు గురయ్యారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని మరమ్మత్తు చేసినట్లు తెలపడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే రైలులో పొగలు వ్యాపించడానికి గల కారణం బ్యాటరీ క్యాప్ లీక్ అవడంతో ఈఘటన తలెత్తిందని రైల్వే సిబ్బంది తెలిపారు. మరమ్మత్తు అనంతరం కాజీపేట నుంచి బయలు దేరింది.
Medicine Prices Hike: పెరగనున్న మెడిసిన్ ధరలు.. ఎప్పటి నుంచో తెలుసా..?
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!