జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో సోమవారం ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులు కొండపై నుండి ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపారు. అంతేకాకుండా.. గ్రెనేడ్లు కూడా విసిరారని అధికారులు తెలిపారు. కాగా.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. గత నెల జూన్ 11, 12 తేదీల్లో జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రదాడులతో దద్దరిల్లింది.
మంగళవారం సాయంత్రం కథువా జిల్లాలో సైదా గ్రామంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక జవాన్ అమరుడు కాగా, ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.
Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ అట్టుడుకుతోంది. వరసగా ఉగ్రవాద ఘటనలతో ఆ ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఆదివారం రియాసిలో బస్సుపై దాడి చేసిన ఘటనలో 10 మంది యాత్రికులు చనిపోయారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ కథువాలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ)కి సమీపంలో హీరానగర్ సెక్టార్‌లోని కథువాలోని సైదా గ్రామంలో ఇంటిపై ఉగ్రవాదులు దాడులు చేశారు.
లోకో పైలట్లు లేకుండానే ఓ గూడ్సు రైలు దాదాపు 70 కిలో మీటర్లు మేర పరుగులు తీసింది. నెమ్మదిగా కదిలిన రైలు ఆ తర్వాత గంటకు 100 కిలోమీటర్ల వేగంతో సుమారు ఐదు స్టేషన్‌లను దాటి చివరకు పంజాబ్‌లోని ఉంచి బస్సీ రైల్వే స్టేషన్ లో పట్టాలపై ఇసుక బస్తాలను, చెక్క దిమ్మెలు అడ్డుగా ఉంచి రైలును ఆపు చేయగలిగారు.
Train : ఈరోజు ఉదయం అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో జమ్మూలో జరిగిన ఓ ఆశ్చర్యకరమైన సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. జమ్మూలోని కథువాలో రైల్వే ట్రాక్‌పై గూడ్స్ రైలు అత్యంత వేగంతో నడపడం ప్రారంభించింది.
కతువాలోని బకర్వాల్ కమ్యూనిటీకి చెందిన 8 ఏళ్ల బాలిక 10 జనవరి 2018న తప్పిపోయింది. వారం తర్వాత ఆ బాలిక అడవిలో శవమై కనిపించింది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ బాలిక కేసులో ప్రధాన నిందితుడిపై విచారణ జరిగింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని జిల్లా సెషన్స్ కోర్టులో ఈరోజు(శనివారం) తిరిగి ప్రారంభించారు. గత ఏడాది నవంబర్‌లో, శుభమ్ సంగ్రాను జువైనల్‌గా కాకుండా పెద్దవాడుగా విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.