Kashmiri MBBS Student: కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌లో గల అల్-అమీన్ మెడికల్ కాలేజీలో చదువుతున్న కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు చెందిన సెకండ్ ఇయర్ MBBS విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పాటు దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. దీనిపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ సంఘటనచడ జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్పందించింది.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో హమాస్ నాయకులు హల్‌చల్ సృష్టించారు. పశ్చిమాసియాకే పరిమితమైన వారి ప్రభావం ఇప్పుడు భారత్‌లో కూడా విస్తరించేందుకు కుట్ర జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి.
Amit Shah: కాశ్మీర్‌కి హిందూమతంలో గౌరవనీయులైన ఋషి కశ్యపుడి పేరు పెట్టడం సాధ్యమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం అన్నారు. ఢిల్లీలో ‘‘జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ త్రూ ది ఏజెస్’’ పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది, ప్రముఖ పండితుడు ఏజీ నూరానీ గురువారం ముంబైలో మరణించారు. ఆయన వయసు ప్రస్తుతం 93 సంవత్సరాలు. అత్యుత్తమ న్యాయ పండితులు, రాజకీయ వ్యాఖ్యాతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, జేకే నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి పోటీ చేస్తాయని చెప్పారు.
జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవలి కాలంలో ఉగ్రవాద దాడులు ఎక్కువయ్యాయి. ఉగ్రవాదులు ఆర్మీ సిబ్బందిపై దాడి చేసి దాక్కుంటున్న తీరు..స్థానికులపై అనుమానాన్ని రేకిత్తిస్తోంది.
జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.