బీహార్‌లోని ఒక పాఠశాలలో 7వ తరగతి ప్రశ్నాపత్రంలో ఒక ప్రశ్న పెద్ద వివాదాస్పదంగా మారింది. కాశ్మీర్‌ను భారతదేశం నుంచి వేరుచేసే ప్రశ్న ఉందని ఆరోపిస్తూ దుమారం చెలరేగింది. ఈ ఘటన బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో గల పాఠశాలలో జరిగింది.
Cinema theaters to open in Kashmir after 30 years: సుమారు 3 దశాబ్దాల తర్వాత కశ్మీరీలు థియేటర్లో సినిమా చూడబోతున్నారు. కశ్మీర్ లోయలో హింస కారణంగా 1990లో అక్కడి ప్రజలకు సినిమా వినోదం దూరమైంది. భయాందోళనలు, దాడి జరుగుతుందోనన్న భయం కారణంగా అక్కడ సినిమా థియేటర్లు మూసివేశారు. ఇప్పుడక్కడ మునుపటితో పోల్చితే ఓ మోస్తరు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కశ్మీరీ ప్రజలకు సినిమా వినోదం మళ్లీ చేరువ కానుంది.…
జమ్మూకశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లలో అటు ఉగ్రవాదులు, ఇటు భద్రతాబలగాల సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామాలోని తన నివాసంలోనే ఓ ఎస్సైని కాల్చి చంపారు. మృతుడిని ఫరూక్ అహ్మద్ మీర్‌గా గుర్తించారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పుల్వామా జిల్లా పాంపొర్‌లోని సంబూరా ప్రాంతంలో సబ్ ఇన్స్పెక్టర్పై దాడి జరిగిందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. లెథ్‌పొరా సీటీసీ ఐఆర్పీ 23వ బెటాలియన్‌లో మీర్ విధులు నిర్వర్తిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడినవారి…
ఇన్సానియత్….మానవత్వం. జమ్హూరియత్….ప్రజాస్వామ్యం. కశ్శీరియత్ స్నేహం….ఈ మూడు తమ కాశ్మీర్ విధానాన్ని నియంత్రిస్తాయని నాడు ప్రధానిగా అటల్ బిహరి వాజ్ పేయి అన్నారు. మండుతున్న మంచులోయకు మళ్లీ వసంతం వస్తుందని, కోయిలలు తిరిగి వస్తాయని, పూలు వికసిస్తాయని ఆకాక్షించారు…వాజ్ పేయి ఆశ కావచ్చు, ఆశయం కావచ్చు…వాటిని నెరవేర్చే దిశగా అన్నట్టుగా నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాము ఎప్పటి నుంచో చెబుతున్న ఆర్టికల్ 370 రద్దు చేశారు. కాశ్మీరీ పండిట్లు తిరిగొస్తున్నారు….టూరిస్టులతో కళకళలాడుతోంది..డీలిమిటేషన్ తర్వాత ఎన్నికలు జరుగుతాయి…జమ్మూకాశ్మీరం మునుపటిలా…
పాకిస్థాన్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది నేషనల్ అసెంబ్లీ.. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి షహబాజ్ షరీఫ్ ప్రసంగించారు. పాకిస్థాన్‌కు చైనా, సౌదీ, టర్కీ స్నేహితులని చెప్పుకొచ్చారు. చైనా సహకారంతో ప్రాజెక్టుల్ని పరుగులు పెట్టిస్తామన్నారాయన. అయితే, భారత్, అమెరికాలతో సత్సంబంధాలు ముఖ్యమే అన్నారు షరీఫ్. తాము భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నా… కశ్మీర్‌కు శాంతియుత పరిష్కారంతోనే అది సాధ్యమన్నారాయన. ప్రతి అంతర్జాతీయ వేదికపైనా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతామన్నారు పాక్ కొత్త ప్రధాని షహబాజ్ షరీఫ్. ఇక, కశ్మీర్‌లో…
ఇప్పుడంటే చిన్నప్పటి నుంచి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు. మాండలికం ఏదైనా ఇంగ్లీష్ బాష విషయానికి వచ్చేసరికి అందరికీ ఒకేలా ఉంటుంది. ఇప్పుడంటే సరే, అదే పాత రోజుల్లో ఇంగ్లీష్ ఎలా ఉండేది, వివిధ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇంగ్లీష్ పదాలను ఎలా పలికేవారు… ఈ విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే మనం మాట్లాడే ఇంగ్లీష్ వేరు… పాత కాలంలో వివిధ ప్రాంతాల్లో ఉండే ఇంగ్లీష్ వేరు. కాశ్మీర్‌కు చెందిన ఓ బామ్మ చిన్న చిన్న…
ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని జమ్మూకాశ్మీర్‌లో భారత ప్రభుత్వం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాశ్మీర్ వ్యాలీని జమ్మూతో అనుసంధానం చేసేందుకు ఈ రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. చినాబ్ నడిపై 1.3 కిలోమీటర్ల మేర 359 మీటర్ల ఎత్తులో రైల్వే బ్రిడ్జి ఉండబోతున్నది. ఫ్రాన్స్‌లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎక్కువ ఎత్తులో ఈ బ్రిడ్జి ఉంటుంది. ఈ బ్రిడ్జి కిందనుంచి మేఘాలు పాస్ అవుతున్న దృశ్యాలను రైల్వేశాఖ మంత్రి అశ్విన్ సోషల్ మీడియాలో…
కాశ్మీర్‌లో పోలీసు, భద్రతా దళాల ఉమ్మడి బృందాలు గత 48 గంటల్లో 6 గురు ఉగ్రవాదులను హతమార్చాయి. అనంత్‌నాగ్‌లోని కలాన్ సిర్గుఫ్వారా గ్రామంలో ఒక ఉగ్రవాది ఉన్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను శనివారం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అయితే సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదిని లొంగిపోవాలని కోరినా వినకుండా విచక్షణారహితంగా పోలీసులు, భద్రతా దళాలపై కాల్పులు తెగబడ్డాడు. దీంతో ఎదురుకాల్పులు చేసి ఆ ఉగ్రవాదిని ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. అయితే…