Karumuri Nageswara Rao: ప్రజలందరూ కూడా ఏక కంఠంతోటి.. రావాలి జగన్.. కావాలి జగన్ అని కోరుకొంటున్నారు అని తెలిపారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుని మెంటల్ క్యాండిడేట్‌గా మండిడపడ్డారు.. చంద్రబాబు నాయుడుకి ఏపీ రాష్ట్ర ప్రజల పట్ల ఏమాత్రం పట్టదు.. వారికీ మంచి జరిగేది అతనికి ఇష్టం ఉండదు అన్నారు. ఇవాళ మన సీఎం జగన్ పేదలకు ఇచ్చే ఆసరా కానీ మరియు విద్యా దీవెన అలాగే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీకి అడ్డుతగిలాడని దుయ్యబట్టారు. ఈ రోజు పేదలు వాళ్ల పిల్లలు బాగా చదువుకునే విధంగా వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేసి ఎన్నో రకాలు ఏర్పాటు చేస్తుంటే పచ్చ బ్యాచ్ వాళ్లు తట్టుకోలేక పోతున్నారని ఫైర్ అయ్యారు.
Read Also: Varun Sandesh: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న వరుణ్ సందేశ్.. ‘నింద’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..
ఇక, చంద్రబాబుకి మైండ్ దొబ్బింది అనుకొంటున్నాను ఆయనను మెంటల్ హాస్పటల్లో చేర్పించాలని వ్యాఖ్యానించారు మంత్రి కారుమూరి.. సీఎం వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్ళాడు.. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.. ప్రజల్లో మమేకమై పోతుంటే అతని మీద బురద జల్లి ఆనందపడాలనుకుంటున్నారని మండిపడ్డారు.. భారతదేశంలో ఇతర రాష్ట్రాలన్నీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు తొంగి చూస్తున్నాయన్నారు. ప్రజలందరూ కూడా ఏక కంఠంతోటి.. రావాలి జగన్.. కావాలి జగన్.. అని కోరుకొంటున్నారని తెలిపారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.