PMO Rename: ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. వలసవాద పాలన అవశేషాలు కూడా మిగలకుండా పలు నిర్ణయాలను తీసుకుంది. తాజాగా ఢిల్లీలోని కొత్త ప్రధాని భవన సముదాయం పేరును మార్చారు. పీఎంఓ పేరును ‘‘సేవా తీర్థ్’’గా మార్చారు. ఇటీవల, గవర్నర్ల అధికార నివాసమైన రాజ్ భవన్ పేరును ‘‘లోక్ భవన్’’గా మార్చారు.
India Republic Day: భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ (Kartavya Path)లో ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం, సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం మరింత ప్రత్యేకంగా ఉండడంతో త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు…
Google Doodle: భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ప్రత్యేక ‘వైల్డ్‌లైఫ్ మీట్స్ కల్చర్‘ (Wildlife Meets Culture) డూడిల్‌ను రూపొందించింది. ఈ డూడిల్ భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని, ప్రాంతాల భిన్నత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడింది. ఈ రంగురంగుల కళాఖండాన్ని పుణేకు చెందిన కళాకారుడు రోహన్ దహోత్రే చిత్రీకరించారు. ఈ డూడిల్‌లో లడాఖ్ ప్రాంతానికి చెందిన సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న మంచు చిరుత, ధోతీ-కుర్తా ధరించిన ‘పులి’తో పాటు, పావురం, నీలగిరి తహర్…
Daredevils: ఇండియన్ ఆర్మీకి చెందిన కదిలే మోటార్ బైక్‌లపై హ్యూమన్ పిరమిడ్‌తో సరికొత్త ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో డేర్‌డెవిల్స్ ఈ అసాధారణ ఘనతను నెలకొల్పింది. 20.4 అడుగుల ఎత్తులో నిర్వహించిన ఈ ఫీట్‌లో మొత్తం 40 మంది సభ్యులు పాల్గొన్నారు.
Republic Day : న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 41 మందిని ఆహ్వానించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులను ఎంపిక చేసి, వారికి ఈ ఘనతను అందించింది. వీరు వివిధ రంగాలలో తమ ప్రతిభను చాటుకున్నారు మరియు ప్రభుత్వ పథకాలను సమర్థంగా ఉపయోగించుకున్నారు. ఈ ప్రత్యేక అతిథుల ఎంపికతో గణతంత్ర దినోత్సవంలో తెలంగాణకు…
ఢిల్లీలో ఇవాళ ఉదయం 10.30గంటల ప్రారంభమయ్యే 75వ గణతంత్ర వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తిని చాటబోతుంది. ఈ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.
రేపు (జనవరి 26న) దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే సంబరాలు జరుగనున్నాయి. దేశ రాజధానిలోని కర్తవ్య మార్గ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో దాదాపు 14,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.
దేశ రాజధానిలోని ఇండియా గేట్ సమీపంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కొత్తగా నామకరణం చేసిన కర్తవ్యపథ్‌ను ప్రారంభించారు.