PM Modi will inaugurate Kartavya Path: ప్రధాని నరేంద్రమోదీ నేడు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వలసపాలన గుర్తులను చెరిపివేస్తూ.. రాజ్ పథ్ పేరును ‘కర్తవ్యపథ్’గా మార్చారు. నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా కర్తవ్యపథ్ ప్రారంభం కాబోతోంది. గురువారం సాయంత్రం ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించున్నారు. అక్కడే ఇండియా గేట్ సమీపంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు మోదీ.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం 7 గంటలకు ఇండియా గేట్ వద్ద కర్తవ్యపథ్‌తో పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటుందని, ఈ అమృత్‌కాల్ మన దేశం పట్ల మన కర్తవ్యాన్ని నిర్వర్తించేలా మనల్ని ప్రేరేపించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.