Tungabhadra Dam: తుంగభద్రకు పోటెత్తిన భారీ వరద.. గేట్లు ఎత్తివేత
- తుంగభద్ర జలాశయానికి భారీ వరద పోటెత్తింది..
- పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు.. ప్రస్తుత నీటి మట్టం 1628.09 అడుగులు..
- ఇన్ ఫ్లో 101993 క్యూసెక్కులు.. ప్రాజెక్టులోని 3 గేట్లు ఎత్తివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tungabhadra Dam: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. దీంతో.. తుంగభద్ర జలాశయానికి భారీ వరద పోటెత్తింది.. పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా.. ఇప్పటికే తుంగభద్ర నీటి మట్టం 1628.09 అడుగులకు చేరింది.. ఇక, ఇన్ ఫ్లో రూపంలో 1,01,993 క్యూసెక్కుల నీరు వచ్చి తుంగభద్ర డ్యామ్‌లో చేరుతోంది.. దీంతో.. అప్రమత్తమైన అధికారులు.. ప్రాజెక్టులోని 3 గేట్ల ద్వారా దిగవకు నీటిని విడుదల చేస్తున్నారు.. దీంతో.. తుంగభద్ర జలాశయం నుంచి 7,744 క్యూ సెక్కుల నీరు ఔట్‌ఫ్లో రూపంలో దిగివ ప్రాంతానికి వెళ్లిపోతోంది.. మరోవైపు.. తుంగభద్ర పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 87.056 టీఎంసీలుగా ఉందని అధికారులు చెబుతున్నారు..
Read Also: Tummala Nageswara Rao: సాధ్యమైనంత త్వరగా అమలు చేస్తాం.. రెండో విడత రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు
Also Read
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
- Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
ఇక, తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరించారు.. ఎగవ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోన్న నేపథ్యంలో.. ప్రాజెక్టులోని మరికొన్ని గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో.. హస్‌పేట బళ్లారితో పాటు కర్నూలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.. నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. కృష్ణా నది ఉపనదిగా ఉన్న తుంగభద్ర డ్యాం గేట్లు తెరవడంతో.. కృష్ణా నదిలోకి వరద పోటెత్తింది.. దీంతో.. దిగువన ఉన్న శ్రీశైలం డ్యామ్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో.. శ్రీశైలం డ్యామ్ మరింత వేగంగా నిండే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!