Karnataka: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విచిత్రమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మదిగెరె, చిక్కమగళూర్ జిల్లా్ల్లో అంగన్వాడీ టీచర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకుని అభ్యర్థులకు ఉర్దూ భాషని తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో కన్నడ మాట్లాడాలని, కన్నడిగులకు తొలి ప్రాధాన్యం ఇస్తామి చెబుతున్న ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆదేశాలు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది.
Karnataka: ముడా భూ కుంభకోణం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ముడా స్కామ్‌లో సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. అయితే, దీనిని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించిన సిద్ధరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. ‘‘ ఈ కేసులో గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించారని, వాస్తవాలు వెలుగులోకి తేవాలి’’ అని హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ నాగ ప్రసన్న అన్నారు. సిద్ధరామయ్య వేసిన పిటిషన్‌ని కొట్టేశారు.
అవయవ దానం చేయడం మంచిదే. అది ఎప్పుడు చేయాలి.. కోమాలో ఉన్నప్పుడో.. లేదంటే చనిపోయాక చేయడం మంచిదే. అంతేకాని చిన్న వయసులో.. పసి బిడ్డలు కలిగిన వారు చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి శ్రీశానంద ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. ఇది తెలియకుండానే జరిగిందన్నారు. ఇది ఏ వ్యక్తి లేదా సమాజంలోని వర్గాల మనోభావాలను దెబ్బతీయడానికి ఉద్దేశించబడలేదని స్పష్టం చేశారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటన సమయంలో రిజర్వేషన్లు, సిక్కులపై మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. అయితే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలపై అమెరికాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బెంగళూర్‌లోని హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్కి అధికారికంగా ఫిర్యాదు చేశారు.
Karnataka : కర్ణాటకలో మిలాద్-ఉల్-నబీ ఊరేగింపుల సందర్భంగా పాలస్తీనా జెండాలు రెపరెపలాడాయి. ఈ కారణంగా రాజకీయాలు తీవ్రంగా ఉన్నాయి. కాగా, రాష్ట్ర మంత్రి బి. జాడే. జమీర్ అహ్మద్ ఖాన్ జెండాలు ఊపడాన్ని సమర్థించారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదాల తయారీకి నందిని నెయ్యిని మాత్రమే వినియోగించాలని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
కర్ణాటకలో నలుగురు మైనర్లు పాలస్తీనా జెండాలతో హల్చల్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భద్రతలో భారీ లోపం వెలుగు చూసింది. బెంగళూరులో ఇంటర్నేషనల్ డెమొక్రసీ డే వేడుకలకు హాజరైన సీఎం.. స్టేజ్ పై కూర్చుని ఉండగా అనుకోని సంఘటన జరిగింది. గుర్తు తెలియని ఓ యువకుడు సెక్యూరిటీని దాటుకుని మరీ వేదికపైకి దూసుకొచ్చాడు. అతని చేతిలో ఉన్న శాలువాని సిద్ధరామయ్యపైకి విసిరాడు. వెంటనే అలర్ట్ అయిన సీఎం భద్రతా సిబ్బంది అతడిని పట్టుకున్నారు.
Prajwal Revanna: జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో సిట్ దూకుడు పెంచింది. అతడిపై మూడో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వందలాది సె*క్స్ వీడియోలు వెలుగులోకి వచ్చాయి. హసన్ జిల్లాలో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.