DK Shivakumar: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రజాదరణకు భయపడి ఆయనపై బీజేపీ నిందలు వేస్తోందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. సిద్ధరామయ్య పవర్ఫుల్ మాస్ లీడర్, ఆయనతో సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన బలమైన ప్రజానాయకులందర్ని అంతమొందించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బెంగళూర్లో శుక్రవారం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రైతు రుద్దరప్ప ఆత్మహత్యను వక్ఫ్ భూములకు ముడి పెడుతూ పోస్టు పెట్టి.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యతో పాటు రెండు కన్నడ పత్రికల ఎడిటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బెంగళూరులో హైడ్రా బృందం పర్యటిస్తుంది. రెండు రోజుల పాటు బెంగళూరులో హైడ్రా పర్యటన కొనసాగనుంది. కర్ణాటక ప్రభుత్వంతో పాటు CSR కింద కొన్ని కంపెనీలు అభివృద్ధి చేసిన చెరువులను హైడ్రా బృందం స్టడీ చేయనుంది.
Karnataka: కర్ణాటకలో మరోసారి ఔరంగజేబ్ పోస్టర్లు కలకలం రేపాయి. బెలగావిలో షాహు నగర్ ప్రాంతంలో ఔరంగజేబ్ పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు పెట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఔరంగజేబ్ని ‘‘సుల్తాన్-ఏ-హింద్’’, ‘‘అఖండ భారత్ నిజమైన స్థాపకుడు’’ అని అభివర్ణించే పోస్టర్లనున ఆయన జయంతి సందర్భంగా ఉంచారు. Read Also: AUS vs IND: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. భారత్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం! అయితే, ఈ పోస్టర్లు స్థానికంగా ఉద్రిక్తత కలిగించాయి. స్థానికుల నిరసన మధ్య బ్యానర్లను తీసివేసి,…
కాంగ్రెస్ ఎన్నికల హామీల తీరుపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. తాజాగా ఎన్నికల హామీలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కౌంటర్ ఎటాక్ చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు
Kharge : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీ పథకాలను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఐదు రకాల సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు విశ్వాసం వ్యక్తం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీని గురించి గర్వంగా భావించి, దేశంలోని పురాతన పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే మహారాష్ట్ర ఓటర్లకు ఐదు హామీలను ఇచ్చింది. అయితే, కర్ణాటకలో 5 హామీల పథకం కాంగ్రెస్కు ఖర్చుతో…
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎత్తేస్తున్నారంటూ వచ్చిన వార్తలతో కర్ణాటకలో తీవ్ర కలకలం రేగింది. దీపావళి పండుగ రోజున మహిళలకు షాక్ తగిలినట్లైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై పున:సమీక్షిస్తామంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ అన్నారు.
Free Bus: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలక పథకాల్లో మహిళలకు ‘‘ఫ్రీబస్’’ సదుపాయం ఒకటి. ప్రభుత్వం ఇప్పుడు ఈ ‘‘శక్తి’’ పథకాన్ని కొనసాగించడంపై పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Karnataka: కర్ణాటకకు చెందిన మహిళా నాయకురాలు, ఆ రాష్ట్ర మాజీ మంత్రిని బ్లాక్మెయిల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్తో గత కొంత కాలంగా సంబంధాన్ని ఏర్పరుచుకున్న మంజులా అనే మహిళ, ఆయనకు సంబంధించిన వాట్సాప్ కాల్స్, అభ్యంతరకరమైన వీడియోలను ఉపయోగించి బ్లాక్మెయిల్ చేసింది. వీటిని నిలిపేయాలంటే తనకు రూ. 20 లక్షలు కావాలని డిమాండ్ చేసింది. బ్లాక్మెయిల్, దోపిడికి పాల్పడిన కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కలబురిగిలో జిల్లా…
Panipuri: ఆహార నాణ్యత విషయంలో కర్ణాటక సర్కార్ నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. క్యాబేజీ మంచూరియాలో కృత్రిమ రంగులు, రసాయనాలు వాడటాన్ని ఇప్పటికే నిషేధించింది. తాజాగా చాలా మంది ఫేవరెట్ అయిన ‘‘పానీపూరీ’’ని నిషేధించే దిశగా కర్ణాటక వెళ్తోంది.