SM Krishna: కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ(92) కన్నుమూత.
- కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత
- ఇవాళ తెల్లవారుజామున బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూత
- 1999-2004 వరకు కర్ణాటక సీఎంగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SM Krishna: కర్ణాటక సీనియర్ రాజకీయ నేత, మాజీ విదేశాంగ మంత్రి, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ ఈరోజు (డిసెంబర్ 10) తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని సదాశివనగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయనకు 92 ఏళ్లు కాగా.. వృద్ధాప్య వ్యాధితో బాధపడుతున్న ఎస్ఎం కృష్ణను చికిత్స నిమిత్తం తొలుత వైదేహి ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. డా. సత్యనారాయణ మైసూర్, డా. సునీల్ కారంత్ నేతృత్వంలోని వైద్యుల బృందం చికిత్స అందించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఎస్ఎం కృష్ణ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆయనను ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. కానీ ఈ రోజు తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు.
మే 1, 1932న కర్ణాటకలోని మాండ్య జిల్లా మద్దూరు తాలూకా సోమనహళ్లి గ్రామంలో జన్మించిన ఎస్ఎం కృష్ణ పూర్తి పేరు సోమనహళ్లి మల్లయ్య కృష్ణ. ఎస్ఎం కృష్ణ తన ప్రాథమిక విద్యను హత్తూరులో, సెకండరీ విద్యను మైసూర్‌లోని శ్రీ రామకృష్ణ విద్యాశాలలో, తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌ని మైసూర్‌లోని మహారాజా కాలేజీలో, లా డిగ్రీని యూనివర్సిటీ లా కాలేజీలో పూర్తి చేశాడు. ఆయన డల్లాస్, టెక్సాస్, యూఎస్ఏలోని సదరన్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయం, వాషింగ్టన్ డీసీలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ లా స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యాడు.
Also Read
- SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
- Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
- Rapthadu Attack: రాప్తాడు ఘటన.. గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలింపు..
- Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
Read Also: Mumbai: కర్ణాటకలోని బెలగావిని యూటీ చేయండి.. మోడీకి ఆదిత్య థాక్రే విజ్ఞప్తి
స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల రాజకీయ రంగ ప్రవేశం
1962లో మద్దూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ఎస్ఎం కృష్ణ.. రాజకీయ జీవితంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ‘ప్రజా సోషలిస్టు పార్టీలో’ చేరారు. అయితే 1967 ఎన్నికల్లో మద్దూరు నుంచి కాంగ్రెస్‌కు చెందిన ఎంఎం గౌడ్‌పై ఓడిపోయారు. 1968లో సిట్టింగ్ ఎంపీ మరణించడంతో మాండ్య లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1968 ఉప ఎన్నికల తర్వాత మాండ్య నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1971, 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. మాండ్యాను కాంగ్రెస్ కంచుకోటగా నిలబెట్టడంలో ఎస్ఎం కృష్ణ కీలక పాత్ర పోషించారు.
పాంచజన్య యాత్ర నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు…
1999లో కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించారు. ఆ సందర్భంగా ఎస్ఎం కృష్ణ చేపట్టిన పాంచజన్య యాత్ర కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్‌కు సత్తా చాటింది. ఎస్ఎం కృష్ణ 1999 నుండి 2004 వరకు కర్ణాటక 16వ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు. డిసెంబర్ 2004లో మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన కృష్ణ 5 మార్చి 2008న మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. తర్వాత రాజ్యసభకు ఎన్నికై, 2009 మే 22న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
చిన్న వయసులోనే బీజేపీలో చేరారు
తన రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లో బలమైన నాయకుడిగా కొనసాగిన ఎస్ఎం కృష్ణ తన రాజకీయ జీవితం ముగిశాక జనవరి 29, 2017న కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. 2017 మార్చిలో అధికారికంగా బీజేపీలో చేరారు.వృద్ధాప్య సంబంధిత అనారోగ్యం, ఇతర కారణాల వల్ల 7 జనవరి 2023న రాజకీయాల నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. ఎస్ఎం కృష్ణ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్ఎం కృష్ణ జీవిత చరిత్ర ‘స్మృతి వాహిని’ డిసెంబర్ 2019 లో విడుదలైంది. కన్నడ నటుడు డా. రాజ్‌కుమార్‌ను కడగళ్ల వీరప్పన్ అపహరించడం (ఎస్ఎం కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు), జేడీఎస్ అధినేత హెచ్డి దేవెగౌడ కాంగ్రెస్‌లో చేరాలని యోచిస్తున్న అనేక ఆసక్తికరమైన సంఘటనలను ఆయన ‘స్మృతి వాహిని’లో ప్రస్తావించారు.
తాజావార్తలు
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!