కర్ణాటక సీఎంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లలో సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలని మల్లగుల్లాలు పడిన పార్టీ అధిష్ఠానం.. చివరకు సిద్ధరామయ్య పేరును ఖరారు చేసింది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నాలుగు రోజులుగా సాగిన రాజకీయ డ్రామాకు నేటితో తెరపడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పలు సమావేశాల తర్వాత బుధవారం అర్ధరాత్రి కర్ణాటక నూతన ముఖ్యమంత్రి పేరును ప్రకటించారు.
Karnataka: కర్ణాటకలో ఘన విజయం సాధించినా..కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడానికి సతమతం అవుతోంది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో పాటు మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా పదవిని ఆశిస్తుండటంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అయితే బుధవారం సీఎం ఎంపికపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ తో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. రాహుల్ గాంధీ హామీ మేరకు డీకే శివకుమార్ మెత్తబడినట్లు సమాచారం.
కర్ణాటక సీఎం ఎవరనే విషయంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ తనకు తల్లి లాంటిదని, వెన్నుపోటు పొడవబోనని, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడనని హస్తినకు వెళ్లటానికి ముందు డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు కారణమని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి.
Karnataka Politics: కర్ణాటక సీఎం పదవి వ్యవహారం ఢిల్లీకి చేరింది. కర్ణాటకలో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ సాధించినా.. సీఎం అభ్యర్థి ఎవరనేది తేలడం లేదు. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరు కూడా సీఎం అభ్యర్థిత్వాన్ని కోరుకోవడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే సీఎం రేసులో మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. తమ నేతకే సీఎం పదవి కావాలని కాంగ్రెస్ లీడర్ జీ పరమేశ్వర అనుచరులు తుమకూరులో…
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు దేశానికి సానుకూల భవిష్యత్తును తెలియజేస్తున్నాయని, ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.
Karnataka: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఏకంగా 34 ఏళ్ల తరువాత భారీగా ఓట్లను, సీట్లను సంపాదించింది. మొత్తం 224 సీట్లలో 135 సీట్లను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే సీఎం అభ్యర్థిత్వం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. మాజీ సీఎం సిద్దరామయ్యతో పాటు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందా..? అనేది సస్పెన్స్ గా మారింది.
Congress: కర్ణాటక ఎన్నికలు ముగిసినా.. కాంగ్రెస్ భారీ విజయం సాధించినా.. ఇప్పటికే సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఆదివారం సాయంత్రం బెంగళూర్ లోని షాంగ్రీల్లా హోటల్ కేంద్రంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎల్పీ సమావేశం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కాంగ్రెస్ నేతలు జైరాంరమేష్, రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు సుశీల్ కుమార్ షిండే, దీపక్ బబారియా, జితేంద్ర సింగ్ అల్వార్ పరిశీలకులుగా ఉన్నారు.