కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం, తదనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్.. కాంగ్రెస్‌ని అభిననందించాలని కోరుకోవడం లేదని, కానీ కర్ణాటక ప్రజల తీర్పుని అయినా అభినందించాల్సి ఉండే అన్నారు. అభినందించకపోయినా…తిట్టాడం ఎందుకు అని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్… కేసీఆర్ ఇద్దరి మాటలు ఒకేలా ఉన్నాయని ఆయన విమర్శించారు. సంజయ్ మాటలు.. కేసీఆర్ సమర్ధించారని, బీజేపీ విధానంకి… కేసీఆర్ మద్దతు ఇచ్చారన్నారు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా.. ‘తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మోడీకి ఎక్స్పైరి డేట్ అయిపోయింది. మోడీ ఓటమిని చిన్నది చేసి కేసీఆర్ చూపించడం ఎవరు సహించడం లేదు.
Also Read : Virat Kohli : బౌలర్ గా అవతారమెత్తిన విరాట్ కోహ్లీ
మోడీ విధానం… కేసీఆర్ కి నచ్చుతుంది. విడిపోయినట్టు నటించి… బీజేపీ..brs ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారు కేసీఆర్. కర్ణాటక లో జేడీఎస్ కోసం కేసీఆర్. బీజేపీ కోసం మోడీ పని చేశారు. ప్రజలు ఇద్దరికీ గుణపాఠం చెప్పారు. నిన్న కర్ణాటక లో కాంగ్రెస్.. రేపు తెలంగాణ.. నెక్ట్స్..కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో కి వస్తోంది. తెలంగాణ ఇవ్వకపోతే.. కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గర భిక్షం ఎత్తుకునేది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నది కాంగ్రెస్. దేశానికి స్వాతంత్య్రం ఇచ్చింది కాంగ్రెస్. మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ ద్రోహం చేసిందా.. కేంద్రంలో కేసీఆర్ ని మంత్రిని చేసింది కాంగ్రెస్.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. ఇవన్నీ చేసినందుకు ద్రోహం చేసినట్టా..?.. ఇవన్నీ ద్రోహమే అయితే.. కేసీఆర్ చెప్పింది నిజమే..
బీసీ పాలసీ త్వరలోనే తెస్తున్నాం.. బీసీ గర్జన కూడా పెడుతున్నాం.. బీసీ జనాభా లెక్క తేల్చండి అంటే ఎవరూ అడ్డుకుంటున్నారు.. మోడీ ఎందుకు బీసీ ల జనాభా లెక్క తేల్చడం లేదు ఎందుకు.. బీసీ లకు అన్యాయం చెస్సింది బీజేపీ, కేంద్రంలో బీసీ శాఖ ఎందుకు లేదు. పదవి పోయే ముందు… మోడీకి బీసీలు గుర్తుకు వచ్చారు.’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : Tollywood: నేడు రెండు… రేపు రెండు!